DK Shiva Kumar: మరో 2 నెలల్లో కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ?

కర్ణాటకలో మరో రెండు, మూడు నెలల్లో డీకే శివ కుమార్ సీఎంగా బాధ్యతలు స్వీకరించే ఛాన్స్ ఉందని అక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్బాల్‌ హుస్సేన్ అన్నారు. ప్రస్తుతం పార్టీ హైకమాండ్ శివకుమార్‌ గురించే మాట్లాడుతోందని తెలిపారు.

New Update
DK Shiva Kumar

DK Shiva Kumar


కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ త్వరలో ముఖ్యమంత్రి పదవి స్వీకరిస్తారంటూ గత కొన్ని రోజులుగా ప్రచారం నడుస్తోంది.  అక్కడి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. మరో రెండు, మూడు నెలల్లో డీకే శివ కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే ఛాన్స్ ఉందని అన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు ఎవరు కృషి చేశారో అందరికీ తెలుసని.. ప్రస్తుతం పార్టీ హైకమాండ్ శివకుమార్‌ గురించే మాట్లాడుతోందని తెలిపారు.  

Also Read: మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం..

DK Shiva Kumar Get CM Post

ఈ ఏడాది చివర్లో కర్ణాటక ప్రభుత్వంలో సీఎం మార్పు గురించి ఊహగాణాలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో డీకే శివకుమార్‌కు సన్నిహితుడైన ఇక్బాల్‌ హుస్సేన్ ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమవుతోంది. కర్ణాటకలో సెప్టెంబర్ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో విప్లవాత్మక పరిణామాలు ఉంటాయని కర్ణాటక మంత్రి కె. ఎన్ రాజన్న ఇటీవల అన్నారు. ఈ క్రమంలోనే త్వరలో సీఎం మార్పు ఉంటుదంని కాంగ్రెస్‌లో కూడా విస్తృతంగా చర్చలు నడుస్తున్నాయి. 

Also Read: అమెరికాలో బర్త్ రైట్ సిటిజన్‌షిప్‌పై సంచలన తీర్పు

ఈ విషయంపై ఇప్పటికే సీఎం సిద్ధరామయ్య కూడా పలుమార్లు స్పందించారు. నాయకత్వ మార్పు అనేది అధిష్ఠానం పరిధిలో ఉందని.. ఈ విషయంలో తాను బహిరంగంగా మాట్లాడలేనని తెలిపారు. ఇదిలాఉండగా కర్ణాటకలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచాక సీఎం పదవిపై తీవ్ర స్థాయిలో చర్చలు జరిగాయి. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ రెండున్నరేళ్ల పాటు పదవిలో కొనసాగేలా అంగీకరించారనే వార్తలు వచ్చాయి. దీంతో శివకుమార్ సీఎం పదవి స్వీకరించే సమయం వచ్చిందనే ప్రచారం జోరుగా నడుస్తోంది.  

Also Read: చెత్త లారీలో నగ్నంగా మహిళ మృతదేహం.. సినిమా లెవెల్‌లో దారుణ హత్య!

Also Read: చెత్త లారీలో నగ్నంగా మహిళ మృతదేహం.. సినిమా లెవెల్‌లో దారుణ హత్య!

telugu-news | rtv-news | dk-shiva-kumar | karnataka

#karnataka #dk-shiva-kumar #rtv-news #telugu-news
Advertisment
తాజా కథనాలు