/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
BREAKING NEWS
BREAKING:
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాద(Road Accident) ఘటన చోటు చేసుకుంది. కురబలకోట మండలంలోని దొమ్మన్న బావీ వద్ద టెంపోను లారీ ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు స్పాట్‌లోనే మృతి చెందగా మరో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read: ఆర్టీసీలో తగ్గుతున్న ఉద్యోగులు.. డ్రైవర్లే కండక్టర్లుగా !
ఇదిలా ఉండగా.. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుడిహత్నూర్ సమీపంలో ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలోని అమరావతికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండగా క్షతగాత్రులను 108 అంబులెన్సుల్లో ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.