🔴LIVE BREAKINGS: నాగార్జునపై అందుకే ఆ వ్యాఖ్యలు.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

Spicejet: విమానం గాల్లో ఉండగా తెరుచుకున్న కిటికీ.. వీడియో వైరల్

గోవా నుంచి పుణె వెళ్తున్న స్పేస్‌జెట్‌ విమానంలో గాల్లో ఉండగానే ఓ కిటికీ ఫ్రేమ్‌ తెరుచుకుంది. దీంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. చివరికి ఆ విమానం పుణె ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.

ఈ మధ్యకాలంలో తరచుగా విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తుతున్నాయి. దీనివల్ల వాటిని వెనక్కి మళ్లించడం, అత్యవసరం ల్యాండింగ్ చేయడం లాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. తాజాగా మరో విమానం ప్రమాదం నుంచి తప్పించుకుంది. గోవా నుంచి పుణె వెళ్తున్న స్పేస్‌జెట్‌ విమానంలో గాల్లో ఉండగానే ఓ కిటికీ ఫ్రేమ్‌ తెరుచుకుంది. దీంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. చివరికి ఆ విమానం పుణె ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Also Read: దారుణం.. స్విమ్మింగ్ పూల్‌లో పడి డెలివరీ బాయ్ మృతి.. 22వ అంతస్తులో ఫుడ్ ఇవ్వడానికి వెళ్లి!

ఇదిలాఉండగా మంగళవారం బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండ్ అయింది. సాంకేతిక లోపం తలెత్తడంతో పైలెట్ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విమానం అత్యవసర ల్యాండింగ్ కావడంతో లోపల ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అప్పటికి విమానంలో 222 మంది ప్రయాణికులు ఉన్నారు.ఇటీవల మరో ఇండిగో ఫ్లైట్‌ ప్రమాదానికి గురైంది. గువాహాటి నుంచి చెన్నైకి వెళ్తున్న ఇండిగో విమానం ప్రమాదంలో పడింది. దీంతో పైలట్లు మేడే సందేశం ఇచ్చారు. ఆ తర్వాత విమానాన్ని బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అందులో 168 మంది ప్రయాణికులు ఉన్నారు.

Also Read: లేడీస్ బాత్‌రూమ్‌లో ఏపీ టెకీ పాడుపని.. చివరికి ఇలా దొరికేశాడు

మరోవైపు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో బుధవారం వాతావరణం అనుకూలించకపోవడంతో పలు విమానాలు దారిమళ్లించారు. ఎయిర్‌ పోర్టులో ల్యాండ్‌ అయ్యేందుకు వాతావరణం అనుకూలించకపోవడంతో పలు విమానాలను బెంగళూరుకు మళ్లించారు. మంబాయి -శంషాబాద్‌ , వైజాగ్‌ -శంషాబాద్‌, జైపూర్‌ -శంషాబాద్‌ విమానాలను బెంగళూరుకు మళ్లించారు.

Live Breakings | today-news-in-telugu | telugu-news | latest-telugu-news | latest telugu news updates

  • Jul 03, 2025 15:35 IST

    Dalai Lama: డ్రాగన్‌కు భారత్ వార్నింగ్.. ఆ హక్కు చైనాకు లేదు: కేంద్రమంత్రి కిరణ్ రిజుజు

    భౌద్దమత గురువు దలైలామా వారసుడి ఎంపికను బీజింగ్‌ ఆమోదించాలన్న చైనా డిమాండ్‌పై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 15వ దలైలామా ఎంపిక ప్రక్రియ పూర్తిగా ప్రస్తుత దలైలామా చేతుల్లోనే ఉంటుందని స్పష్టం చేసింది.

    dalailama



  • Jul 03, 2025 15:15 IST

    కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం!!

    నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని ED పిటిషన్‌ వేసింది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటికే సోనియా, రాహుల్‌ సహా తదితరులపై ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. 

    National Herald case



  • Jul 03, 2025 14:38 IST

    Hair Problems: వర్షాకాలం జుట్టు సంరక్షణకు ఈ చిట్కాలు ఫాలో అవ్వండి

    ఈ వర్షాకాలం సీజన్‌లో జుట్టుకు పెద్ద సమస్య లాంటిదే. జుట్టు సంరక్షణ కోసం మొలకెత్తిన ధాన్యాలు, పాలకూర, గుడ్లు, పప్పులు, గింజలను ఆహారంలో చేర్చుకోవాలి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

    hair fall



  • Jul 03, 2025 14:28 IST

    కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేపై టీపీసీసీ ప్రెసిడెంట్ సీరియస్

    కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే అనిరుధ్ చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సీరియస్ అయ్యారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్నామని అన్నారు. ఆధారాలు లేకుండా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు.

    mahesh kumar goud



  • Jul 03, 2025 14:15 IST

    నాగార్జునపై అందుకే ఆ వ్యాఖ్యలు.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు

    కొండ మురళి, సురేఖ దంపతులు హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షీ నటరాజన్‌తో సమావేశమయ్యారు. ఈ రిపోర్టులో కొండా సురేఖ గతంలో సమంత, నాగార్జునపై చేసిన కామెంట్స్‌పై మురళి క్లారిటీ ఇచ్చారు.

     

    Konda Murali and Nagarjuna
    Konda Murali and Nagarjuna

     



  • Jul 03, 2025 13:40 IST

    మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధం.. రహస్యంగా మిలిటరీ నగరాన్ని నిర్మిస్తున్న చైనా !

    చైనాకు సంబంధించి ఓ కీలక అప్‌డేట్‌ వెలుగులోకి వచ్చింది. బీజింగ్‌కు నైరుతి దిశలో 20 మైళ్ల దూరంలో ఓ భారీ రహస్య సైనిక నగరాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది అమెరికాకు చెందిన పెంటగాన్ కన్న పది రేట్లు పెద్దగా ఉంటుందని సమాచారం.

     

    China's New 'Military City' Is 10x the U.S. Pentagon's Size
    China's New 'Military City' Is 10x the U.S. Pentagon's Size

     



  • Jul 03, 2025 12:29 IST

    పాక్‌ సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలపై మళ్లీ నిషేధం..

    పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్‌కు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఖాతాలను భారత్‌లో నిషేధించారు. ఈ నిషేధం బుధవారం ఎత్తివేశారు. కానీ మళ్లీ గురువారం ఖాతాలను నిషేధించారు. షాహిద్ అఫ్రిది, హనియా అమీర్‌ సహా చాలామంది ప్రముఖులు ఈ లిస్ట్‌లో ఉన్నారు.

     

    Pak social media accounts banned again after 'tech glitch' leads to unblocking
    Pak social media accounts banned again after 'tech glitch' leads to unblocking

     



  • Jul 03, 2025 12:18 IST

    మరోసారి ‘తల్లికి వందనం’.. జూలై 10న తల్లుల ఖాతాల్లోకి రూ.13వేలు

    AP సర్కార్ ‘తల్లికి వందనం’ పథకంలో భాగంగా రెండో విడత డబ్బులను జూలై 10న రిలీజ్ చేయాలని నిర్ణయించింది. ఒకటో తరగతి, ఇంటర్ ఫస్ట్‌ఇయర్‌లో జాయినైన వారికి విడుదల చేయనున్నారు. ఇప్పటివరకూ ఒకటోతరగతిలో 5.5లక్షలు, ఇంటర్‌ ఫస్టియర్‌లో 4.7లక్షల మంది విద్యార్థులు చేరారు.

     

    Talliki Vandanam
    Talliki Vandanam

     



  • Jul 03, 2025 11:32 IST

    పులిల్ని వేటాడే బెబ్బులి.. ‘వీరమల్లు’ విధ్వంసం.. ట్రైలర్ గూస్‌బంప్స్

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న మరో భారీ హైప్ మూవీ ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ ఇవాళ రిలీజ్ చేశారు. ఇందులో పవర్ స్టార్ పవర్ ఫుల్ రోల్ అభిమానుల్లో ఉత్సాహం నింపింది.

     

    Hari Hara Veera Mallu telugu trailer
    Hari Hara Veera Mallu telugu trailer

     



  • Jul 03, 2025 09:29 IST

    తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఫిల్మ్‌నగర్‌ ఎస్సై స్పాట్ డెడ్

    తెలంగాణలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సిద్దిపేట జిల్లా చేర్యాల గేటు వద్ద బుధవారం అర్ధరాత్రి లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఫిల్మ్‌నగర్‌ ఎస్సై రాజేశ్వర్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

     

    Siddipet Road Accident Filmnagar SI died
    Siddipet Road Accident Filmnagar SI died

     



  • Jul 03, 2025 09:15 IST

    ఇదెక్కడి మాస్‌ రా మావా.. బీరు తాగుతూ వాదించిన న్యాయవాది..

    గుజరాత్‌లో ఆసక్తిరక ఘటన చోటుచేసుకుంది. ఓ సీనియర్ న్యాయవాది బీర్‌ తాగుతూ క్లయింట్ తరఫున వాదనలు వినిపించారు. దీంతో గుజరాత్ హైకోర్టు చర్యలకు దిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

     

    Shocking video shows Gujarat lawyer casually sipping on beer during court hearing
    Shocking video shows Gujarat lawyer casually sipping on beer during court hearing

     



  • Jul 03, 2025 09:14 IST

    ఆఫ్రికాలో ముగ్గురు భారతీయుల్ని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు

    పశ్చిమాఫ్రికాలోని మాలిలో మంగళవారం ఉగ్రదాడులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు భారతీయ పౌరులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అల్‌ఖైదాతో సంబంధం ఉన్న గ్రూప్ జమాత్‌ నుస్రత్ అల్‌ఇస్లాం వాల్‌ ముస్లిమీన్ దీనికి బాధ్యత వహించింది

     

    3 Indians abducted amid terror attacks by Al Qaeda outfit in Mali
    3 Indians abducted amid terror attacks by Al Qaeda outfit in Mali

     

     



  • Jul 03, 2025 07:51 IST

    హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం.. రబ్బర్ ఫ్యాక్టరీలో ఎగసిపడిన మంటలు

    రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇవాళ తెల్లవారుజామున కాటేదాన్‌లోని శివం రబ్బర్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. స్థానికులు భయాందోళనకు గురై వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.



  • Jul 03, 2025 07:35 IST

    తొలి రోజు భారత్ భారీ స్కోరు.. 5 వికెట్ల నష్టానికి వీర బాదుడు - గిల్ సెంచరీ

    ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సెకండ్ టెస్ట్‌లో భారత్ భారీ స్కోర్ చేసింది. తొలి రోజు ఆట ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్ సెంచరీతో చెలరేగాడు. 216 బంతుల్లో 114 పరుగులు చేశాడు.

     

    Team India captain Shubman Gill scored a century in the second Test in England
    Team India captain Shubman Gill scored a century in the second Test in England

     



  • Jul 03, 2025 07:34 IST

    తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం

    తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆలయం ముందు ఉన్న చలువ పందిళ్లకు మంటలు అంటుకున్నాయి. భారీగా పొగ, మంటలు వ్యాపించడంతో భక్తులు పరుగులు తీశారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసింది.

     



  • Jul 03, 2025 07:34 IST

    విమానం గాల్లో ఉండగా తెరుచుకున్న కిటికీ..

    గోవా నుంచి పుణె వెళ్తున్న స్పేస్‌జెట్‌ విమానంలో గాల్లో ఉండగానే ఓ కిటికీ ఫ్రేమ్‌ తెరుచుకుంది. దీంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. చివరికి ఆ విమానం పుణె ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.

     

     



  • Jul 03, 2025 07:33 IST

    దారుణం.. స్విమ్మింగ్ పూల్‌లో పడి డెలివరీ బాయ్ మృతి.. 22వ అంతస్తులో ఫుడ్ ఇవ్వడానికి వెళ్లి!

    ముంబైలో పెద్ద అపార్ట్‌మెంట్‌లో ఫుడ్ డెలివరీ ఇచ్చేందుకు వెళ్లిన ఓ డెలివరీ బాయ్ ప్రాణాలు కోల్పోయాడు. 22వ అంతస్తుకు ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లగా.. ఒక్కసారిగా అదుపుతప్పి స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయాడు. రక్షించేవారు లేకపోవడంతో ప్రాణాలు విడిచాడు.

     

    mumbai food delivery boy died
    mumbai food delivery boy died

     



Advertisment
Advertisment
తాజా కథనాలు