/rtv/media/media_files/2025/07/03/hari-hara-veera-mallu-telugu-trailer-2025-07-03-11-05-17.jpg)
Hari Hara Veera Mallu telugu trailer
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న మరో భారీ హైప్ మూవీ ‘హరిహర వీరమల్లు’(Hari Hara Veera Mallu Trailer). ఈ సినిమా కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ ఇవాళ రిలీజ్ చేశారు. ఇందులో పవర్ స్టార్ పవర్ ఫుల్ రోల్ అభిమానుల్లో ఉత్సాహం నింపింది. యాక్షన్ సన్నివేశాలు సైతం ఆకట్టుకుంటున్నాయి.
Also Read : ఎవరికీ భయపడేది లేదు.. కొండా మురళి సంచలన కామెంట్స్
Hari Hara Veera Mallu Trailer
ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఇలీవల అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని ఈ నెల అంటే జులై 24న (Hari Hara Veera Mallu Release Date) రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అందులో పవన్ కల్యాణ్ ఊరమాస్ లుక్ అదిరిపోయింది.
పవన్ హీరోగా నటిస్తున్న ఈ కొత్త చిత్రానికి క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్స్ అందిస్తూ అభిమానుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఇకపోతే ఈ మూవీ ప్రారంభమై రెండు మూడేళ్లు గడుస్తుంది. కానీ ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు.
Also Read : అయ్యో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో 5గురు మృతి - అందులో నలుగురు చిన్నారులు
పవన్ కల్యాణ్ రాజకీయాలలో బిజీ బిజీగా ఉండటం, బ్యాక్ గ్రౌండ్ వర్క్ పెండింగ్ వల్ల ఈ చిత్రం వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటికే చాలా డేట్లు అనౌన్స్ చేశారు. కానీ ఆ డేట్లు వాయిదా వేశారు. చివరికి జూన్ 12న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. అది కూడా వాయిదా పడింది. ఇప్పుడు మరోడేట్ అనౌన్స్ చేశారు. ఈ సారి ఈ డేట్ మారకూడదని అభిమానులు కోరుకుంటున్నారు.
Also Read : ఆఫ్రికాలో ముగ్గురు భారతీయుల్ని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు
Also Read : 16 ఏళ్ల బాలుడిని రేప్ చేసిన 40 ఏళ్ల స్కూల్ టీచర్
Pawan Kalyan Hari Hara Veera Mallu