/rtv/media/media_files/2025/07/03/siddipet-road-accident-filmnagar-si-died-2025-07-03-09-13-57.jpg)
Siddipet Road Accident Filmnagar SI died
తెలంగాణలో మరో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ, కారు ఢీకొన్న ఘటనలో ఎస్సై స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
రోడ్డు ప్రమాదంలో ఎస్సై మృతి
ప్రస్తుతం తెలంగాణలో బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. చివరి ఘట్టమైన రథోత్సవం బుధవారం కన్నుల పండువగా జరిగింది. బల్కంపేట పురవీధుల్లో ఎల్లమ్మను ఊరేగించారు.
Also read: హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం.. రబ్బర్ ఫ్యాక్టరీలో ఎగసిపడిన మంటలు
ఇందులో భాగంగానే బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద బందోబస్తు ముగించుకొని వస్తుండగా.. సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చేర్యాల గేటు వద్ద బుధవారం అర్ధరాత్రి లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఫిల్మ్‌నగర్ ఎస్సై రాజేశ్వర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఎస్సై రాజేశ్వర్ సంగారెడ్డిలోని చాణక్యపురి కాలని నివాసి. ఈ ప్రమాదంలో ఆయన మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: ఆస్తి కోసం అత్తను చంపిన కోడలు.. మరిదిలతో అక్రమ సంబంధం
HYDలో అగ్ని ప్రమాదం
తెలంగాణలోని పాశమైలారం ఘటన మరువకముందే మరో ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. ఇవాళ రంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇవాళ అంటే గురువారం తెల్లవారుజామున కాటేదాన్‌లోని శివం రబ్బర్ ఫ్యాక్టరీలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి.
Also Read : సికింద్రాబాద్ లో బాలిక అదృశ్యం..అల్ఫాహోటల్ వైపు వెళ్లి.....
దీంతో స్థానికులు భయాందోళనకు గురై వెంటనే బయటకు పరుగులు తీశారు. అనంతరం స్థానికులు భయాందోళనకు గురై వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది నాలుగు ఫైర్ యంత్రాలతో మంటలను అదుపు చేశాయి. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది ఇంకా తెలియరాలేదు.
Telangana Crime | Latest crime news | road accident