/rtv/media/media_files/2025/07/03/china-2025-07-03-13-09-13.jpg)
China's New 'Military City' Is 10x the U.S. Pentagon's Size
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుండటం, భారత్-పాక్, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఇటీవల జరిగిన పరస్పర దాడులు సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితులు మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయనే ప్రచారాలు కూడా నడిచాయి. అందుకే ఆయా దేశాలు తమ రక్షణ రంగంపై మరింత దృష్టి సారించాయి. అయితే తాజాగా చైనాకు సంబంధించి ఓ కీలక అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. బీజింగ్‌కు నైరుతి దిశలో 20 మైళ్ల దూరంలో ఓ భారీ రహస్య సైనిక నగరాన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది అమెరికాకు చెందిన పెంటగాన్ కన్న పది రేట్లు పెద్దగా ఉంటుందని సమాచారం. ఈ ఆర్మీ క్యాంపస్‌కు సంబంధించిన రిపోర్టును ఫైనాన్షియల్ టైమ్స్, ది సన్ లాంటి ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఇది కేవలం సైనిక కమాండ్ సెంటర్ మాత్రమే కాదు.. అణు యుద్ధం లాంటి అత్యవసర సమయాల్లో కూడా చైనా వ్యూహాత్మక ప్రణాళికలో ఇది భాగమని యూఎస్ ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్నాయి. ఆ ప్రదేశంలో రహస్య బంకర్లు, సొరంగాల నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ పౌరులకు అనుమతి లేదు. డ్రోన్లు లేదా కెమెరికా కూడా వినియోగించకూడదు. ఆ చోట ఇలాంటి ఆంక్షలు ఉండటంతో చైనా ఈ ఆర్మీ ప్రాజెక్టును ప్రపంచానికి తెలియకుండా రహస్యంగా ఉంచాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఆఫ్రికాలో ముగ్గురు భారతీయుల్ని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు
Also Read : మామతో సరసాలు.. పెళ్లైన 45 రోజులకే భర్తను లేపేసింది
China Started Secret Military City
దేశంలో కేవలం అణ్వాయుధాలు ఉంటే సరిపోదని.. అణు దాడుల నుంచి రక్షణ పొందే వ్యవస్థలను కలిగిఉండటం కూడా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. అందుకే చైనా ఈ భారీ సైనిక నగరం కింద బంకర్లను నిర్మిస్తోంది. ఈ బంకర్లకు ఎలాంటి అణుదాడినైనా తట్టుకునే సామర్థ్యం ఉంటుంది. అలాగే యుద్ధ సమయాల్లో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌గా కూడా ఇవి పనిచేస్తాయి. 2024 నుంచి ఈ ప్రాజెక్టు నిర్మాణ కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇందులో మొదటగా సొరంగాలు, రోడ్లు నిర్మించారు. తర్వాత బంకర్‌లు, ఇప్పుడు భవనాలు నిర్మించనున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఇదెక్కడి మాస్ రా మావా.. బీరు తాగుతూ వాదించిన న్యాయవాది.. VIDEO
వాస్తవానికి అమెరికాలోని పెంటగాన్ ప్రపంచంలోనే అతిపెద్ద అధికార సైనిక భవనంగా పరిగణిస్తారు. కానీ చైనాకు చెందిన మిలిటరీ సీటి దీనికి మించి ఉండనుంది. చైనా నిరంతరం తన అణ్వాయుధ సామాగ్రిని, సైనిక మౌలిక సదుపాయాలను పెంచుకుంటోంది. అమెరికా నివేదికల ప్రకారం.. చైనా అణుశక్తి రాబోయే పదేళ్లలో అమెరికాతో సమానంగా లేదా దాన్ని అధిగమించే రక్షణ వ్యవస్థను కలిగి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టుకు సంబంధించి చైనా ఎలాంటి అధికారికంగా ప్రకటించలేదు. దీనిపై వస్తున్న ప్రచారాన్ని కూడా ఖండిస్తోంది. కానీ చైనా ఈ ప్రాజెక్టును రహస్యంగా చేపడుతోందని తెలుస్తోంది. శాటిలైట్ చిత్రాలు, అమెరికా నిఘా నివేదికలు ఆధారంగా ఇది బయటపడింది.
Also Read : పాక్ సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలపై మళ్లీ నిషేధం..
world-war-3 | china | rtv-news | telugu-news