Konda Murali: నాగార్జునపై అందుకే ఆ వ్యాఖ్యలు.. కొండా మురళి సంచలన వ్యాఖ్యలు
కొండ మురళి, సురేఖ దంపతులు హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షీ నటరాజన్‌తో సమావేశమయ్యారు. ఈ రిపోర్టులో కొండా సురేఖ గతంలో సమంత, నాగార్జునపై చేసిన కామెంట్స్‌పై మురళి క్లారిటీ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీలో గత కొన్నిరోజులుగా కొండా దంపతులకు, ఇతర నేతలుగా విభేదాలు సాగుతున్న సంగతి తెలిసిందే. హైకమాండ్‌కు కూడా వీళ్లు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. అయితే తాజాగా గాంధీ భవన్‌కు వచ్చిన కొండా మురళీ క్రమశిక్షణ కమిటీకి రిపోర్టు అందించారు. ఇటీవల తనపై ఆరోపణలు రాగా వారంలోగా లిఖిత పూర్వకంగా సమాధానం ఇవ్వాలని క్రమశిక్షణ ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ నేపథ్యంలోనే గురువారం కొండ మురళి, సురేఖ దంపతులు హైదర్‌గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షీ నటరాజన్‌తో సమావేశమయ్యారు. ప్రస్తుతం ఉమ్మడి వరంగల్‌లో జరుగుతున్న విషయాలపై నివేదికను ఆమెకు అందించారు.
అయితే ఈ రిపోర్టులో కొండా సురేఖ గతంలో సమంత, నాగార్జునపై చేసిన కామెంట్స్‌పై మురళి క్లారిటీ ఇచ్చారు. మహేష్‌బాబు, రాజమౌళిపై సురేఖ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని.. ఫోన్ ట్యాపింగ్ అంశంలో మాత్రమే తాను మాట్లాడినట్లు పేర్కొన్నారు. కావాలనే కొందరు సురేఖ వ్యాఖ్యలు వక్రీకరించారని తెలిపారు. సురేఖ ఫోన్ ట్యాపింగ్ విషయాలు మాత్రమే చెప్పిందని.. సినీ ప్రముఖులను ఉద్దేశించి కాదని అన్నారు. ఇప్పటికే AICCకి దీనిపై వివరణ ఇచ్చినట్లు మురళీ తెలిపారు.
నటరాజన్‌తో భేటీ తర్వాత కూడా కొండా మురళి మీడియాతో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. '' నేను వెనుకబడిన వర్గాల ప్రతినిధిని. ఎవరికీ భయపడేది లేదు. 44 ఏళ్ల నుంచి నా ఎపిసోడ్ కొనసాగుతూనే వస్తోంది. నాకు నేనుగా ఎవరిపై కామెంట్లు చేయను. నా జోలికి వస్తే మాత్రం ఊరుకోను. కేసులకు భయపడే వ్యక్తిని కాదు. ప్రజల బలంతోనే రాజకీయాల్లో కొనసాగుతున్నాను. నేను బీసీ కార్డు పట్టుకునే బతుకుతున్నాను. పేదల సమస్యలు పరిష్కరిస్తాను కాబట్టే నా దగ్గరికి జనం వస్తారు. కొందరు పనిచేసే వాళ్లపైనే రాళ్లు వేస్తారు. పార్టీ ఎవరికి టికెట్లు ఇచ్చినా కూడా గెలిపించే బాధ్యత నేను తీసుకుంటానని నటరాజన్‌కు చెప్పాను. మా సేవలను పార్టీ వినియోగించుకోవాలని కోరాను.
కాంగ్రెస్ పార్టీని బతికించడమే నా ఉద్దేశం. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడమే నా లక్ష్యం. రేవంత్ రెడ్డిని ఇంకో పదేళ్లు సీఎంగా చూడాలని ఉంది. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌కు అండగా నిలుస్తాను. శుక్రవారం జరగనున్న సభ గురించి చర్చించాం. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచేలా కృషి చేస్తాను. వరంగల్‌లో ఎమ్మెల్యేలందరినీ మళ్లీ గెలిపించడమే నా బాధ్యత. ఎవరికీ భయపడేది లేదు. నాకు ఎలాంటి గ్రూపు రాజకీయాలతో సంబంధం లేదని'' కొండా మురళి అన్నారు.
అనంతరం కొండా సరేఖ మాట్లాడారు. '' నాకు అప్పగించిన శాఖలకు న్యాయం చేస్తున్నాను. ఇప్పటిదాకా మంత్రిగా ఎలాంటి తప్పులు చేయలేదు. కూతురు సుష్మిత రాజకీయాల్లోకి వచ్చే దానిపై స్పందిస్తూ.. మా ఇంట్లో ఎవరి ఆలోచనలు వాళ్లకు ఉంటాయి. నా కుమార్తె ఏమనుకుంటుందో నాకు ఎలా తెలుస్తుంది. ఆమె భవిష్యత్తు ఏంటో తనే నిర్ణయించుకుంటుంది. భవిష్యత్తులో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని'' కొండా సురేఖ అన్నారు.

Konda Murali and Nagarjuna

Also Read: మామతో సరసాలు.. పెళ్లైన 45 రోజులకే భర్తను లేపేసింది

Also Read: మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధం.. రహస్యంగా మిలిటరీ నగరాన్ని నిర్మిస్తున్న చైనా !