Kidnap: ఆఫ్రికాలో ముగ్గురు భారతీయుల్ని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు

పశ్చిమాఫ్రికాలోని మాలిలో మంగళవారం ఉగ్రదాడులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు భారతీయ పౌరులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అల్‌ఖైదాతో సంబంధం ఉన్న గ్రూప్ జమాత్‌ నుస్రత్ అల్‌ఇస్లాం వాల్‌ ముస్లిమీన్ దీనికి బాధ్యత వహించింది

New Update
3 Indians abducted amid terror attacks by Al Qaeda outfit in Mali

3 Indians abducted amid terror attacks by Al Qaeda outfit in Mali

పశ్చిమాఫ్రికాలోని మాలిలో మంగళవారం ఉగ్రదాడులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు భారతీయ పౌరులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అల్‌ఖైదాతో సంబంధం ఉన్న గ్రూప్ జమాత్‌ నుస్రత్ అల్‌ఇస్లాం వాల్‌ ముస్లిమీన్ దీనికి బాధ్యత వహించింది. ఈ ఘటనపై భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. కిడ్నాప్‌ అయిన భారతీయులను విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని మాలి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. జులై 1న కొందరు ఉగ్రవాదులు మాలిలోని డైమండ్ సిమెంట్‌ ఫ్యాక్టరీపై దాడి చేశారు. 

Also Read: ఆస్తి కోసం అత్తను చంపిన కోడలు.. మరిదిలతో అక్రమ సంబంధం

3 Indians Abducted Amid Terror Attacks

అక్కడ పనిచేస్తున్న ముగ్గురు భారతీయ పౌరులును కిడ్నాప్ చేశారు. అయితే ఆ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో నిరంతరం సంప్రదింపులు జరుగుతున్నామని విదేశాంగ శాఖ తెలిసింది. కిడ్నాప్ అయిన వాళ్లని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. అలాగే మాలిలో ఉంటున్న ఇతర భారతీయులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. ఏదైనా అవసరం ఉంటే అక్కడి భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపింది.  

Also Read :  బోటు బోల్తా.. నలుగురు మృతి - 61 మంది గల్లంతు

Also read: దారుణం.. స్విమ్మింగ్ పూల్‌లో పడి డెలివరీ బాయ్ మృతి.. 22వ అంతస్తులో ఫుడ్ ఇవ్వడానికి వెళ్లి!

Also Read :  Thug Life OTT: ఓటీటీలోకి ‘థగ్‌ లైఫ్‌’.. సైలెంట్‌గా వచ్చేసిన కమల్ హాసన్

terrorist | africa | rtv-news | telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు