/rtv/media/media_files/2025/06/12/loGCAiTWprwdrNuUNqlw.jpg)
Talliki Vandanam
ఏపీలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో భాగంగా ‘తల్లికి వందనం’ పథకాన్ని ఇటీవల అమలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 67లక్షల 27 వేల 164 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు వేసింది. కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికీ.. ఒక్కొక్కరికీ రూ.13 వేల చొప్పున సాయం అందజేసింది.
Also Read : ఎవరికీ భయపడేది లేదు.. కొండా మురళి సంచలన కామెంట్స్
అయితే కూటమి ప్రభుత్వం ముందుగా ఒక్కొక్కరికీ రూ. 15వేలు ఇస్తానని చెప్పింది. ఇప్పుడు వాటిలో రూ.2వేలు కట్ చేసి రూ.13వేలు మాత్రమే ఇచ్చింది. ఆ కట్ చేసిన డబ్బును పాఠశాలలు/జూనియర్ కళాశాల నిర్వహణ, పరిశుభ్రత/పారిశుధ్యం, పాఠశాల విద్యా శాఖ రూపొందించే SOP ప్రకారం ఇతర అంశాలకు ఉపయోగించనున్నారు.
Also Read : అయ్యో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో 5గురు మృతి - అందులో నలుగురు చిన్నారులు
Talliki Vandanam Scheme second phase
ఇదిలా ఉంటే కూటమి సర్కార్ ఇప్పుడు ‘తల్లికి వందనం’ పథకంలో భాగంగా రెండో విడత డబ్బులను జూలై 10వ తేదీన రిలీజ్ చేయాలని నిర్ణయించింది. ఈ రెండో విడతలో.. ఒకటో తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో జాయిన అయిన వారికి ఈ నిధులు విడుదల చేయనున్నారు.
Also Read : ఆఫ్రికాలో ముగ్గురు భారతీయుల్ని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు
కాగా ముందుగా జూలై 5వ తేదీన ఈ నిధులు రిలీజ్ చేస్తామని ప్రభుత్వం గతంలో చెప్పింది. కానీ ఇంకా అడ్మిషన్లు జరుగుతున్న నేపథ్యంలో ఎక్కువ మంది లబ్ధి పొందాలనే ఉద్దేశంతో దీనిని జూలై 10 వరకు పెంచారు. ఇప్పటివరకూ ఒకటో తరగతిలో 5.5 లక్షలు మంది విద్యార్థులు చేరగా.. ఇంటర్ ఫస్టియర్‌లో 4.7లక్షల మంది విద్యార్థులు జాయిన్ అయ్యారు.
Also Read : 16 ఏళ్ల బాలుడిని రేప్ చేసిన 40 ఏళ్ల స్కూల్ టీచర్
talliki-vandanam | ap talliki vandanam | talliki vandanam latest news