/rtv/media/media_files/2025/07/03/dalailama-2025-07-03-15-30-05.jpg)
భౌద్దమత గురువు దలైలామా వారసుడి ఎంపికను బీజింగ్ ఆమోదించాలన్న చైనా డిమాండ్‌పై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. 15వ దలైలామా ఎంపిక ప్రక్రియ పూర్తిగా ప్రస్తుత దలైలామా చేతుల్లోనే ఉంటుందని స్పష్టం చేసింది. దలైలామా వారసుడిని నిర్ణయించే అధికారం టిబెటన్ ఆధ్యాత్మిక నాయకుడు తప్ప మరెవరికీ లేదని ఇండియా తెలిపింది. ఈ మేరకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. దలైలామా స్థానం టిబెటన్లకు మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అనుచరులందరికీ అత్యంత ముఖ్యమైనది. తన వారసుడిని నిర్ణయించే హక్కు దలైలామాకే మాత్రమే ఉందని ప్రకటనలో పేర్కొన్నారు.
India firmly rejects China's interference in the Dalai Lama's succession. Only the Dalai Lama himself can decide his successor, declares Union Minister Rijiju. #DalaiLama#India#China#Tibet#Successionpic.twitter.com/YupaPfPwKy
— Vishal Vishwakarma (@VishalVishwkrm) July 3, 2025
కొత్త దలైలామాను ఎన్నుకుంటామని చైనా చేసిన వ్యాఖ్యలపై 14వ దలైలామా టెన్జిన్ గ్యాట్సో అలియాస్ లామా థోండుప్ స్పందించాడు. 15వ దలైలామా ఎంపిక 600 సంవత్సరాల పురాతన బౌద్ధ సంప్రదాయాల ఆధారంగానే జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం తన ట్రస్ట్ గాడెన్ ఫోడ్రాంగ్ తీసుకుంటుందని.. ఇందులో చైనా పాత్ర ఏం ఉండదని స్పష్టం చేశారు. దలైలామా 90వ పుట్టినరోజు నాలుగు రోజుల ముందు ప్రారంభమైన టిబెటన్ ఆధ్యాత్మిక కార్యక్రమంలో దలైలామా ఈ వ్యాఖ్యలు చేశారు.