/rtv/media/media_files/2025/07/03/mumbai-food-delivery-boy-died-2025-07-03-06-35-36.jpg)
mumbai food delivery boy died
ముంబైలో దారుణమైన విషాదం చోటుచేసుకుంది. అతి పెద్ద అపార్ట్‌మెంట్‌లో ఫుడ్ డెలివరీ ఇచ్చేందుకు వెళ్లిన ఓ డెలివరీ బాయ్ ప్రాణాలు కోల్పోయాడు. 22వ అంతస్తుకు ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లగా.. ఒక్కసారిగా అదుపుతప్పి స్విమ్మింగ్ పూల్‌లో పడిపోయాడు. ఆ సమయంలో చుట్టూ ఎవరూ రక్షించేవారు లేకపోవడంతో ఈత రాత అందులోనే ప్రాణాలు విడిచాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read : హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం.. రబ్బర్ ఫ్యాక్టరీలో ఎగసిపడిన మంటలు
Also Read : ఆస్తి కోసం అత్తను చంపిన కోడలు.. మరిదిలతో అక్రమ సంబంధం
ఈత రాక మృతి
44 ఏళ్ల ఇమ్రాన్ అక్బర్ ఖజ్దా అనే వ్యక్తి ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ ఏజెంట్ గా ముంబైలో పనిచేసుకుంటున్నాడు. అతడికి మంగళవారం రాత్రి ఒక ఆర్డర్ వచ్చింది. గ్రాండ్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న అనేక అంతస్థుల గల అపార్ట్‌మెంట్‌లో ఫుడ్ డెలివరీ చేసేందుకు వెళ్లాడు. అలా ఫోన్‌లో మాట్లాడుతూ.. మాట్లాడుతూ మొత్తంగా 22వ అంతస్తుకు చేరుకున్నాడు.
అయితే ఫోన్ ధ్యాసలో ఉండటంతో స్విమ్మింగ్ పూల్ అంచున నడుస్తూ ఒక్కసారిగా అందులో పడిపోయాడు. అయితే చుట్టూ రక్షించేవారు ఎవరూ లేకపోవడం, అతడికి ఈత రాకపోవడంతో పూల్ లోనే మునిగిపోయి ప్రాణాలు విడిచాడు. ఇక ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అతడి మరణానికి సంబంధించి ఎవరిపై కూడా అనుమానం లేదని మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు.
Also Read : తొలి రోజు భారత్ భారీ స్కోరు.. 5 వికెట్ల నష్టానికి వీర బాదుడు - గిల్ సెంచరీ
Also Read : తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం.. భయంతో భక్తులు పరుగో పరుగు
Latest crime news | crime news | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | telugu crime news | national news in Telugu | mumbai | Food Delivery Boy