/rtv/media/media_files/2025/07/03/shocking-video-shows-gujarat-lawyer-casually-sipping-on-beer-during-court-hearing-2025-07-03-09-11-50.jpg)
Shocking video shows Gujarat lawyer casually sipping on beer during court hearing
గుజరాత్‌లో ఆసక్తిరక ఘటన చోటుచేసుకుంది. ఓ సీనియర్ న్యాయవాది బీర్ తాగుతూ క్లయింట్ తరఫున వాదనలు వినిపించారు. దీంతో గుజరాత్ హైకోర్టు చర్యలకు దిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే జూన్ 26న న్యాయమూర్తి జస్టిస్ సందీప్ భట్ ధర్మాసనం ఓ కేసుపై విచారణ జరుపుతోంది. ఆ సమయంలో పిటిషనర్ తరఫున న్యాయవాది భాస్కర్ తన్నా వాదనలు వినిపించేందుకు వర్చువల్‌గా హాజరయ్యారు. అయితే చేతిలో మగ్గుతో బీరు తాగుతూనే ఆయన వాదనలు వినిపించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
गुजरात उच्च न्यायालय की वर्चुअल कार्यवाही के दौरान वरिष्ठ अधिवक्ता भास्कर तन्ना बीयर की चुस्की लेते हुए।
— Rahul Kajal INC 🇮🇳 (@RahulKajalRG) July 1, 2025
अजब-गजब गुजरात मॉडल 😀😂 pic.twitter.com/7QAnpAQYo6
Also read: ఆఫ్రికాలో ముగ్గురు భారతీయుల్ని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు
Gujarat Lawyer Sipping Beer During Court Hearing
నెటిజన్లు ఆయనపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. చివరికి ఆయన ప్రవర్తనను హైకోర్టు ధిక్కరణగా భావించి సుమోటాగా స్వీకరిస్తున్నట్లు గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తులు జస్చిస్ ఎ.ఎస్ సుపేహియా, జస్టిస్ ఆర్.టి వచ్చానీల ధర్మాసనం తాజాగా ప్రకటన చేసింది. అలాగే భాస్కర్‌కు ఉన్న సీనియర్ న్యాయవాది హోదాను కూడా పునఃపరిశీలిస్తామని ధ్వజమెత్తింది. ఇక నుంచి తమ ఎదుట వర్చువల్‌గా వాదనలు వినిపించేందుకు అవకాశం ఉండదని తేల్చిచెప్పింది.
Also Read: ఆస్తి కోసం అత్తను చంపిన కోడలు.. మరిదిలతో అక్రమ సంబంధం
రెండు వారాల తర్వాత ఈ కేసులో వాదనలు వింటామని పేర్కొంది. అప్పటిలోగా భాస్కర్ తీరుపై పూర్తి నివేదికను సిద్ధం చేసి సమర్పించాలని రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు వర్చవల్ విచారణ సమయంలో బీర్ తాగుతూ వాదనలు వినిపించడంపై హైకోర్టు ఆయన్ని వివరణ ఇవ్వాలని చెప్పింది. ఇదిలాఉండగా వారం రోజు క్రితమే మరో వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో ఓ వ్యక్తి టాయిలెట్ సీటుపై కూర్చొని మరీ గుజరాత్ హైకోర్టు ఎదుట వర్చువల్‌గా విచారణకు హాజరయ్యాడు.
Also Read: విమానం గాల్లో ఉండగా తెరుచుకున్న కిటికీ.. వీడియో వైరల్
Also Read : Thug Life OTT: ఓటీటీలోకి ‘థగ్ లైఫ్’.. సైలెంట్‌గా వచ్చేసిన కమల్ హాసన్
national-news | rtv-news | telugu-news