/rtv/media/media_files/2025/07/03/pak-social-media-2025-07-03-12-14-45.jpg)
Pak social media accounts banned again after 'tech glitch' leads to unblocking
జమ్మూకశ్మీర్‌లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య సంబంధాలు చాలావరకు క్షీణించిన సంగతి తెలిసిందే. అలాగే పాక్‌పై ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆ సమయంలో చాలామంది పాక్‌కు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఖాతాలపై భారత్‌లో నిషేధించారు. ఈ నిషేధం బుధవారం ఎత్తివేశారు. కానీ మళ్లీ గురువారం ఖాతాలను నిషేధించారు. షాహిద్ అఫ్రిది, హనియా అమీర్ సహా చాలామంది ప్రముఖులు ఈ లిస్ట్‌లో ఉన్నారు.
Also Read: 16 ఏళ్ల బాలుడిని రేప్ చేసిన 40 ఏళ్ల స్కూల్ టీచర్
Pak Social Media Accounts Banned Again
బుధవారం కొన్నిగంటల పాటు భారత్‌లో పాకిస్తానీ సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలు కనిపించాయి. కానీ మళ్లి అవి ఇప్పుడు కనిపించడం లేదు. అఫ్రిది, ఫవాద్ కాన్, మహీరా ఖాన్ పేర్లను సెర్చ్ చేసినప్పుడు వాళ్ల అకౌంట్లు భారత్‌లో అందుబాటులో లేదని చూపిస్తోంది. సాంకేతిక కారణాల వల్ల ఇలా జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు వారి ఖాతాలను మళ్లీ నిషేధించినట్లు ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
Also Read: అయ్యో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో 5గురు మృతి - అందులో నలుగురు చిన్నారులు హనియా అమీర్.. సర్దార్ జీ 3 చిత్రంలో భారత నటుడు దిల్జిత్ జోసాంజ్‌తో కలిసి నటించారు. దీంతో ఈ అంశం వివాదం చెలరేగింది. చివరికి హనియా ఖాతా కూడా భారత్‌లో నిషేధించారు. ఆమెతో పాటు మహీర్ ఖాన్, ఫవాద్ ఖాన్, షాహిద్ అఫ్రిది, మావ్రా హొకేన్, సబా కమర్, అలీ జాఫర్ లాంటి అనేక మంది పాక్ సెలబ్రిటీల ఖాతాలు భారత్‌లో కనిపించడం లేదు. ఇదిలాఉండగా పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్.. పాకిస్థాన్‌లో ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వతా పాక్ భారత్‌పైకి డ్రోన్లతో దాడులకు యత్నించగా వాటిని మన సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. అలాగే పాక్‌లోని సైనిక స్థావరాలపై విరుచుకుపడింది. చివరికీ ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది.
Also Read : మరోసారి ‘తల్లికి వందనం’.. జూలై 10న తల్లుల ఖాతాల్లోకి రూ.13వేలు
Social Media | pakistan | Jammu Kashmir | rtv-news | telugu-news