IND VS ENG 2ND TEST: తొలి రోజు భారత్ భారీ స్కోరు.. 5 వికెట్ల నష్టానికి వీర బాదుడు - గిల్ సెంచరీ

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సెకండ్ టెస్ట్‌లో భారత్ భారీ స్కోర్ చేసింది. తొలి రోజు ఆట ముగిసే సరికి 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు సాధించింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్ సెంచరీతో చెలరేగాడు. 216 బంతుల్లో 114 పరుగులు చేశాడు.

New Update
Team India captain Shubman Gill scored a century in the second Test in England

Team India captain Shubman Gill scored a century in the second Test in England

భారత్ vs ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. ఇందులో భాగంగానే లీడ్స్‌లో జరిగిన మొదటి టెస్ట్‌లో టీమ్ ఇండియా ఓడిపోయింది. మిస్ ఫీల్డ్, నిరాశ పరిచే బౌలింగ్ కారణంగా భారత్ ఫస్ట్ మ్యాచ్ ఓటమిపాలైంది. ఇప్పుడు ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన సెకండ్ టెస్ట్ మ్యాచ్‌‌లో భారత్ అదరగొట్టేసింది. మొదట టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. 

Also Read :  తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఫిల్మ్‌నగర్‌ ఎస్సై స్పాట్ డెడ్

Also Read :  ఇదెక్కడి మాస్‌ రా మావా.. బీరు తాగుతూ వాదించిన న్యాయవాది..

IND VS ENG 2ND TEST

ఈ సెకండ్ టెస్ట్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, యశస్వీ జైస్వాల్ బ్యాటుతో రాణించారు. తొలి రోజు ఆట పూర్తయ్యేసరికి టీమిండియా 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ సెంచరీ సాధించి అదరగొట్టేశాడు. గిల్ 216 బంతుల్లో 114 పరుగులు చేశాడు. అందులో 12 ఫోర్లు ఉన్నాయి. 

అలాగే ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ 107 బంతుల్లో 87 పరుగులు సాధించాడు. అతడు 13 ఫోర్లతో చక్కటి ఇన్నింగ్స్‌ ఆడాడు. కానీ సెంచరీకి చేరువైన తరుణంలో ఔటయ్యాడు. రవీంద్ర జడేజా 67 బంతుల్లో 41 పరుగులు చేశారు. అందులో 5 ఫోర్లు ఉన్నాయి. 

మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌ 2 పరుగులకే వెనుదిరిగాడు. అలాగే మూడో స్థానంలో దిగిన కరుణ్‌ నాయర్‌ 50 బంతుల్లో 31 పరుగులు చేశాడు. అతడు 5 ఫోర్లు సాధించాడు. నితీశ్‌ కుమార్‌ రెడ్డి సైతం చేతులెత్తేశాడు. 1 పరుగుకే పెవిలియన్‌కు చేరాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్‌ వోక్స్‌ సత్తా చాటాడు. అతడు (2/59) విజృంభించాడు. ఇలా టీమిండియా మొత్తం 85 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్‌లో గిల్, జడేజా ఉన్నారు. 

Also Read :  బోటు బోల్తా.. నలుగురు మృతి - 61 మంది గల్లంతు

Also Read :  ఆస్తి కోసం అత్తను చంపిన కోడలు.. మరిదిలతో అక్రమ సంబంధం

ind-vs-eng | ind-vs-eng-test-match | shabman-gill

Advertisment
Advertisment
తాజా కథనాలు