BIG BREAKING: బీఆర్ఎస్ కు కవిత మరో సంచలన లేఖ.. కేసీఆర్ అందుకు ఒప్పుకుంటారా?

బీసీలకు రిజర్వేషన్ల పెంపు కోసం జాగృతి ఆధ్వర్యంలో చేపట్టనున్న రైల్ రోకోకు మద్దతు ఇవ్వాలని బీఆర్ఎస్ కు లేఖ రాయనున్నట్లు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. దీంతో జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ ఆందోళనకు కేసీఆర్ ఒప్పుకుంటారా? లేదా? అన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది.

New Update
Kavitha Letter to KCR

రేపటి నిరుద్యోగుల ఛలో సెక్రటేరియట్ కార్యక్రమానికి తెలంగాణ జాగృతి సంపూర్ణ మద్దతు ఇస్తుందని సంస్థ అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. ఈ రోజు మీడియా ఆమె చిట్ చాట్ చేశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో 80% స్థానాల్లో గులాబీ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీపై ప్రజలు విసిగిపోయి ఉన్నారన్నారు. జాగృతి కార్యక్రమాలకు బీఆర్ఎస్ నాయకులు కూడా వస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జాగృతి నాయకులు పోటీ చేయాలని అనుకుంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి విజ్ఞప్తి చేయాలన్నారు. సమస్యలపై కేటీఆర్ కు రాత పూర్వకంగా లేఖ రాయాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు.

అన్ని పార్టీలకు లేఖ రాస్తా..

రైల్ రోకో కార్యక్రమం మద్దతు కోసం ఈనెల 10న అన్ని పార్టీలకు లేఖ రాస్తానన్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి కూడా లేఖ రాయనున్నట్లు చెప్పారు. జర్నలిస్ట్ ల అక్రిడేషన్ పదేపదే పొడిగింపు సరైంది కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జర్నలిస్ట్ లకు కొత్త అక్రిడేషన్ లు ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి లేఖ రాయనున్నట్లు చెప్పారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు