🔴Live Breakings: గర్ల్‌ఫ్రెండ్ ప్రాణం తీసిన చికెన్ ముక్క..

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
LIVE BREAKING

LIVE BREAKING

Covid 19: విజృంభిస్తున్న కోవిడ్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకు ప్రమాదమే

దేశంలో కోవిడ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ టైంలో ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం వంటివి చేయాలి. అలాగే ఇమ్యూనిటీ పవర్‌ పెరిగే పదార్థాలు తీసుకోవాలని అంటున్నారు.

Covid 19 : మళ్లీ మాస్కులు రాబోతున్నాయా..? అవుననే అంటోంది వైద్యశాఖ!

దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, రాజస్థాన్, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ ఏడాది కోవిడ్‌ తొలి మరణం కూడా కర్ణాటకలో నమోదైంది. శ్వాస సమస్యలతో ఇబ్బంది పడుతున్న 85 ఏళ్ల వ్యక్తి కర్ణాటకలో మృతి చెందాడు. దీంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రతీ ఒక్కరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

చల్లని నీటితో కాకుండా..

కరోనా రాకుండా ఉండాలంటే ముందుగా శుభ్రత పాటించాలి. బయటకు వెళ్లి వచ్చిన వెంటనే చేతులు, కాళ్లు అన్ని కూడా శుభ్రం చేసుకోవాలి. చల్లని నీరు కంటే వేడి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల వైరస్ చనిపోతుంది. అలాగే శానిటైజర్‌ను తప్పకుండా వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లినప్పుడు మాస్క్ తప్పనిసరి పెట్టుకోండి. 

ఇది కూడా చూడండి: Spirit Movie: దీపికా ఔట్.. యానిమల్ బ్యూటీ ఇన్.. ప్రభాస్‌తో రొమాన్స్‌కి బోల్డ్ బ్యూటీ

రోగనిరోధక శక్తిని పెంచే వాటిని ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ సి, విటమిన్ ఈ, సాల్మన్ ఫిష్ వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. బయటకు వెళ్లేటప్పుడు సోషల్ డిస్టెన్స్ పాటించాలి. రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోకుండా తొందరగా పడుకోవడం అలవాటు చేసుకుంటే.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మీ బాడీలో ఏమైనా మార్పులు కనిపిస్తే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.

ఇది కూడా చూడండి: PM Modi-CM Revanth: ఆ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వండి.. మోదీకి సీఎం రేవంత్ రిక్వెస్ట్!

జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే పోషకాలు ఉండే ఫుడ్ తీసుకుంటూ ఐసోలేషన్‌లో ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా మధుమేహం, క్యాన్సర్, గుండె పోటు, కిడ్నీ వంటి దీర్ఘకాలిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు బయటకు వెళ్లకపోవడం మంచిది. అలాగే ఇంటిని కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటే కోవిడ్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.


Live Breakings

  • May 25, 2025 19:45 IST

    గర్ల్‌ఫ్రెండ్ ప్రాణం తీసిన చికెన్ ముక్క..

    బాయ్‌ఫ్రెండ్‌‌తో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లిన యువతి చికెన్ ముక్క గొంతులో ఇరుక్కొని చనిపోయింది. మహారాష్ట్రలోని పాల్గఢ్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మే 23 రాత్రి డిన్నర్‌కు వెళ్లిన ఆమె చికెన్ పీస్ గొంతులో ఇరుక్కొని ఊపిరాడక చనిపోయింది.

    chicken stuck in throat



  • May 25, 2025 19:37 IST

    Miss World 2025 : దేశ ప్రతిష్టను దిగజార్చారు..మాజీమంత్రి సబితారెడ్డి ఆగ్రహం

    మిస్ వరల్డ్ పోటీల పేరుతో దేశ ప్రతిష్టను దిగజార్చేవిధంగా ప్రవర్తించారని మాజీమంత్రి సబితారెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల్లోపాల్గొన్న వారి పట్ల ఆసభ్యంగా ప్రవర్తించారన్న విమర్శలపై సబితారెడ్డి స్పందించారు.

    Sabitha Indra Reddy
    Sabitha Indra Reddy

     



  • May 25, 2025 19:27 IST

    థానేలో విజృంభిస్తున్న వైరస్..ఒకరు మృతి

    కరోనా మరోసారి తన ప్రతాపం చూపిస్తోంది. దేశవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే కేరళ, కర్ణాటకలో కరోనాతో పలువురు చనిపోగా తాజాగా మహారాష్ట్రలోని థానేలో ఒకరు చనిపోయారు. థానేలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆసుపత్రిలో కరోనాతో 21 ఏళ్ళ వ్యక్తి మృతి చెందాడు.

    Coronavirus disease (COVID-19)
    Coronavirus disease (COVID-19)

     



  • May 25, 2025 19:26 IST

    లాలూ ప్రసాద్ యాదవ్‌ సంచలన నిర్ణయం.. కొడుకుని పార్టీ నుంచి బహిష్కణ



  • May 25, 2025 16:47 IST

    కేసీఆర్ తో సమావేశమైన కేటీఆర్..కవిత ఇష్యూపై చర్చ?

    బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆయన కూతురు, ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ ఇష్యూ ఇప్పుడు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఆయన కుమారుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

    KTR-KCR-and-Kavitha
    KTR-KCR-and-Kavitha

     



  • May 25, 2025 16:47 IST

    భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు యువకులు సజీవ దహనం

    ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ ఆటో ఛార్జింగ్ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు సజీవ దహనమయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

    Two Teens Charred To Death In Fire At E-Rickshaw Charging Station In Delhi
    Two Teens Charred To Death In Fire At E-Rickshaw Charging Station In Delhi

     



  • May 25, 2025 16:46 IST

    గాలివానకు కుప్పకూలిన పోలీస్‌స్టేషన్.. SI దుర్మరణం

    ఉత్తరప్రదేశ్‌ ఘజియాబాద్‌‌లోని ఆదివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి ACP ఆఫీస్ పైకప్పు కూలిపోయింది. డ్యూటీలో ఉన్న సబ్ ఇన్‌స్పెక్టర్ వీరేంద్ర మిశ్రా ఆఫీస్‌లోనే చిక్కుకుపోయారు. 58 ఏళ్ల మిశ్రా బిల్డింగ్ శిథిలాలు మీద పడి ప్రాణాలు కోల్పోయారు.

    Ghaziabad ACP office



  • May 25, 2025 16:45 IST

    ఫామ్ హౌజ్ లో KCRతో కేటీఆర్ భేటీ.. కవిత విషయంలో కీలక నిర్ణయం?

    ఎర్రవల్లిలోని ఫామ్ హౌజ్ కు వెళ్లిన కేటీఆర్ తండ్రి కేసీఆర్ తో సమావేశం అయ్యారు. కవిత విషయంపైనే వీరు ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో కవిత విషయంలో వీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

    KTR Meats KCR Over Kavitha Issue
    KTR Meats KCR Over Kavitha Issue

     



  • May 25, 2025 15:58 IST

    మావోయిస్టు అగ్రనేతల మృతదేహాల తరలింపులో అడ్డంకులు

    చత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టు నాయకుల మృతదేహాల తరలింపులో పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని మావోయిస్టుల బంధువులు, పౌరహక్కలు నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఎన్ కౌంటర్ లో అగ్రనేతలు నంబాల కేశవరావు, నవీన్ లతో పాటు 26 మంది మరణించారు.  

     Nambala Kesav rao
    Nambala Kesav rao

     



  • May 25, 2025 15:57 IST

    ఫేక్‌ వీసాల వ్యాపారం.. ఇద్దరు పాకిస్థానీయులు అరెస్టు

    అమెరికాలో ఫేక్‌ డాక్యుమెంట్స్, ఉద్యోగాలు సృష్టించి అక్రమంగా వీసాలు పొందుతున్న కేటుగాళ్ల గుట్టురట్టయింది. ఆ వీసాలను విదేశీయులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్న ఇద్దరు పాకిస్థానీయులు అరెస్టయ్యారు.

    2 Pakistani Nationals Arrested In USA For Visa Fraud, Know details
    2 Pakistani Nationals Arrested In USA For Visa Fraud, Know details

     



  • May 25, 2025 15:57 IST

    కేరళ తీరంలో మునిగిపోయిన భారీ షిప్.. 24 మంది సిబ్బంది

    అరేబియా సముద్రంలో కేరళ తీరానికి 38 నాటికల్ మైళ్ల దూరంలో లైబీరియా షిప్ మునిగిపోయింది. దీంతో కొచ్చి తీరంలో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. నౌకతో ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నాయి. నౌకలో 24 మంది సిబ్బందిని ఇండియన్ కోస్ట్ గార్డ్‌ రక్షించారు.

    Liberian ship



  • May 25, 2025 15:18 IST

    రెండు ముక్కలుగా GHMC.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం

    గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్​ఎంసీ)ను రెండు ముక్కలు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనివల్ల అభివృద్ధి ఈజీ అవుతుందని భావిస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్ ను ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్​ఆర్) వరకు విస్తరించేందుకు సిద్ధమవుతోంది.

     Greater Hyderabad Municipal Corporation
    Greater Hyderabad Municipal Corporation

     



  • May 25, 2025 15:04 IST

    అమెరికాలో పాక్ పౌరుల అరెస్ట్

    అక్రమంగా అమెరికా వీసాలు ఇప్పిస్తున్న ఇద్దరు పాకిస్తానీలను ఎఫ్‌బీఐ అధికారులు అరెస్టు చేశారు. వీరు అమెరికాలో ఉద్యోగాలు సృష్టించినట్లు ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి అక్రమంగా వీసాలు పొందేవారు. వాటిని విదేశీయులకు పెద్ద మొత్తంలో అమ్ముకునే వారు.

    Pakistanis arrest in US



  • May 25, 2025 14:32 IST

    తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు.. RDXతో పేల్చేస్తామన్న దుండగులు

    యూపీలోని తాజ్‌మహల్‌కు మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆర్‌డీఎక్స్‌తో తాజ్‌మహల్‌ను పేల్చేస్తామని అధికారులకు కేరళ నుంచి ఈ మెయిల్‌ ద్వారా హెచ్చరించారు. తనిఖీలు చేపట్టగా అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు.

     Taj Mahal hoax bomb threat email traced to Kerala, sparks security scare
    Taj Mahal hoax bomb threat email traced to Kerala, sparks security scare

     



  • May 25, 2025 14:31 IST

    ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ.. గంగుల కమలాకర్ సంచలన ప్రకటన!

    కేసీఆర్ కూతురుగా కవిత పెట్టే పార్టీకి ఎంత వాల్యూ ఉంటుందో చూడాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. ఎవరైనా లేఖ రాయొచ్చు కానీ.. బహిరంగం చేయడం కరెక్ట్ కాదన్నారు. తమ లీడర్ కేసీఆర్ అని.. ఆయన బాటలోనే నడుస్తామని స్పష్టం చేశారు.

    MLC Kavitha New Party
    MLC Kavitha New Party

     



  • May 25, 2025 14:30 IST

    విజృంభిస్తున్న కోవిడ్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకు ప్రమాదమే

    దేశంలో కోవిడ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ టైంలో ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం వంటివి చేయాలి. అలాగే ఇమ్యూనిటీ పవర్‌ పెరిగే పదార్థాలు తీసుకోవాలని అంటున్నారు.

    Covid new variant JN.1



  • May 25, 2025 14:30 IST

    కవిత ఇష్యూపై హరీష్ రావు షాకింగ్ రియాక్షన్ !

    కొద్దిసేపటి క్రితం పెట్టిన ప్రెస్ మీట్ లో హరీష్ కవిత ఇష్యూపై ఎలాంటి రియాక్షన్ లేకుండానే తన ప్రసంగాన్ని ముగించారు. ప్రాజెక్టులు, నీళ్లపై ప్రభుత్వాన్ని ఏకిపారేసిన హరీష్ .. కవిత ఇష్యూపై మాత్రం ఒక్కమాట కూడా మాట్లాడలేదు.

    harish-rao kavitha



  • May 25, 2025 14:29 IST

    Mann ki Baat: పాకిస్తాన్‌పై ప్రతీకారం.. మన్ కీ బాత్‌లో మోదీ సంచలన వ్యాఖ్యలు

    ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి పీఎం నరేంద్ర మోదీ నేడు మన్ కీ బాత్‌లో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామని అన్నారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా దేశమంతా ఒక్కటైందన్నారు. ఆపరేషన్ సిందూర్‌తో ప్రపంచానికి భారత్ సత్తా ఏంటో తెలిసిందని తెలిపారు.

    PM Modi
    PM Modi

     



  • May 25, 2025 14:28 IST

    అలా చేస్తేనే పార్టీలో ఉంటా.. కేసీఆర్ కు కవిత పెట్టిన 6 కండిషన్లు ఇవే!

    పార్టీలో ప్రాధాన్యం.. బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దు.. ఇలా KCRకు కవిత 6 కండిషన్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ కండిషన్లకు ఒప్పుకోకుంటే తనదారి తాను చూసుకుంటానని ఆమె స్పష్టం చేస్తున్నట్లు మీడియా కథనాలు వస్తున్నాయి. పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.

    KCR Kavitha



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు