/rtv/media/media_files/2025/05/25/APJskCqHAGkqN7Y7x5CO.jpg)
సరదాగా లవర్స్ డిన్నర్ చేద్దామని ఓ రెస్టారెంట్‌కు వెళ్లారు. 27ఏళ్ల మహిళ మే23న బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి రాత్రి డిన్నర్‌కు వెళ్లింది. చికెన్ ఆర్డర్ చేసి తింటున్నారు. భోజనం చేస్తుండగా చికెన్ పీస్ ఆమె గొంతులో ఇరుక్కుపోయింది. ఊపిరి అందకపోవడంతో ఆ మహిళ అక్కడే కుప్పకూలింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Woman checks in to Palghar resort with boyfriend, dies after choking on chicken; probe onhttps://t.co/XPfVWF5rAK
— Hindustan Times (@htTweets) May 25, 2025
మహారాష్ట్రలోని పాల్గఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికెన్ పీస్ గొంతులో ఇరుక్కోవడం వల్లనే ఆ మహిళ చనిపోయిందా లేక మరో కారణంతోనా అన్నది పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తెలుస్తుందని పోలీస్ అధికారి తెలిపారు.
maharashtra | woman-dies | chicken in the throat | latest-telugu-news | girlfriend | dinner | chicken | chicken-biryani