/rtv/media/media_files/2025/05/25/0DifA0hKBNxboDHY4tKk.jpg)
Nambala Kesav rao
ఇటీవల చత్తీస్ గఢ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన మావోయిస్టు నాయకుల మృతదేహాల తరలింపు విషయంలో పోలీసులు అడ్డంకులు సృష్టిస్తున్నారని మావోయిస్టుల బంధువులు, పౌరహక్కలు నేతలు ఆరోపిస్తున్నారు. ఈ ఎన్ కౌంటర్ లో మావోయిస్ట్ అగ్రనేతలు నంబాల కేశవరావు, నవీన్ లతో పాటు 26 మంది మరణించారు. అయితే వారి మృతదేహాలను అప్పగించే విషయంలో జిల్లా ఎస్పీ అనే అడ్డంకులు సృష్టిస్తున్నారని ఏపీ పౌరహక్కుల సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని పౌరహక్కుల సంఘం ఏపీ అధ్యక్ష, కార్యదర్శులు చిట్టిబాబు, చిలుకా చంద్రశేఖర్ లు సీఎం చంద్రబాబు నాయుడు, హోం మంత్రి అనితకు లేఖ రాశారు. వారి మృతదేహాలను తీసుకురావడానికి మూడురోజుల నుంచి వారి కుటుంబసభ్యులు ప్రయత్నిస్తుంటే నంబాల కేశవరావు కుటుంబసభ్యులకు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ అనేక విధాలుగా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆ లేఖలో ఆరోపించారు.
Also Read: విజృంభిస్తున్న కోవిడ్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకు ప్రమాదమే
Maoists Leader Nambala Kesav Rao
కేశవరావు మృతదేహం కోసం ఛత్తీస్‌గఢ్‌లో మూడురోజులుగా అతడి సోదరుడు వేచి ఉన్నారని, అయితే బస్తర్ ఐజీ సుందర్ రాజ్‌తోపాటు శ్రీకాకుళం ఎస్పీ అతడిని బలవంతంగా వెనక్కి పంపించేశారని లేఖలో పేర్కొన్నారు.మరో నేత నవీన్ కుటుంబసభ్యులతో కలిసి కేశవరావు సోదరుడు.. జిల్లా ఎస్పీని కలిసి దాదాపు 45 నిమిషాలపాటు మాట్లాడినా..ఆయన ఏమాత్రం స్పందించడం లేదని తెలిపారు. అంతేకాక వారిపై నిఘా ఉంచి, గృహనిర్బందంలో ఉంచారని ఆరోపించారు. తప్పనిసరి పరిస్థితుల్లో హైకోర్టు ను ఆశ్రయిస్తే కిందిస్థాయి పోలీసుల ద్వారా ఒత్తిడి తెస్తున్నారన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోనే అంత్యక్రియలు నిర్వహించాలని శ్రీకాకుళం తీసుకురావద్దంటూ వారి కుటుంబ సభ్యులపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆరోపించారు. ఆ మృతదేహాలను తీసుకుని అంత్యక్రియలు నిర్వహించుకోవచ్చని వారి రక్త సంబంధీకులకు హైకోర్టు ఆదేశాలు సైతం జారీ చేసిందని చెప్పారు. అయినప్పటికీ వారి కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని ఆ లేఖలో పౌర హక్కుల సంఘం నేతలు వివరించారు. అంతేకాక మృతదేహాలను తీసుకురావటానికి వెళ్లిన అంబులెన్స్ డ్రైవర్‌ను శ్రీకాకుళం జిల్లా పోలీసులు తీవ్రంగా బెదిరిస్తున్నారని వారు లేఖలో వివరించారు.
Also Read: పహల్గాం బాధిత మహిళల్లో ఆ లక్షణాలు లేవు.. బీజేపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్
మనిషి మరణిస్తే అతనికి గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలను నిర్వహించడం అనావాయితీఅని, అలా బంధువులు, సన్నిహితులు అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తారని, అలాంటి వాటిని నిరాకరించేలా వ్యవహరించడం చట్ట వ్యతిరేకమని పౌరహక్కుల నేతలు లేఖలో ఆక్షేపించారు. అంతేకాదు.. నైతికంగా పౌరులు సైతం దీన్ని హర్షించరన్నారు. శ్రీకాకుళం ఎస్పీ వ్యహరిస్తున్న విధానాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుని మృతదేహాలను అప్పగించేలా చొరవ చూపాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమస్యను సున్నీతంగా పరిష్కరించాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, హోం మంత్రి అనిత వంగలపూడి అనితను ఈ లేఖ ద్వారా ఏపీ పౌర హక్కుల సంఘం నేతలు విజ్ఞప్తి చేశారు. అంతీమ సంస్కారాలు పూర్తి చేసేలా అవకాశం ఇవ్వలని వారు ప్రభుత్వానికి రాసిన లేఖలో కోరారు.
Also Read: విజృంభిస్తున్న కోవిడ్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకు ప్రమాదమే
Also Read : అలా చేస్తేనే పార్టీలో ఉంటా.. కేసీఆర్ కు కవిత పెట్టిన 6 కండిషన్లు ఇవే!
srikakulam latest news | srikakulam | nambala keshava rao death news | Nambala Keshava Rao Brother | Nambala kesavarao | chhattisgarh maoist encounter | chhattisgarh maoist attack | chhasttisgarh maoist news | maoist | Maoist leaders in Telangana