Spirit Movie: దీపికా ఔట్.. యానిమల్ బ్యూటీ ఇన్.. ప్రభాస్‌తో రొమాన్స్‌కి బోల్డ్ బ్యూటీ

హీరో ప్రభాస్, డైరెక్టర్ సందీప్ వంగా కాంబోలో వస్తున్న స్పిరిట్ మూవీలో త్రిప్తి డిమ్రిని సెలక్ట్ చేసినట్లు డైరెక్టర్ ప్రకటించారు. అయితే త్రిప్తి డిమ్రి పేరు మొత్తం ఎనిమిది భాషల్లో కనిపిస్తోంది. ఈ ఎనిమిది భాషల్లో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది.  

New Update
Spirit Movie

Spirit Movie

హీరో ప్రభాస్, డైరెక్టర్ సందీప్ వంగా కాంబోలో స్పిరిట్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీలో హీరోయిన్‌గా యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రిని సెలక్ట్ చేసినట్లు సందీప్ వంగా ప్రకటించారు. స్వయంగా సందీప్ వంగా తన సోషల్ మీడియా ద్వారా స్పిరిట్‌లో త్రిప్తి డిమ్రి ఫిమేల్ లీడ్‌లో నటిస్తుందని వెల్లడించారు. అయితే త్రిప్తి డిమ్రి పేరు మొత్తం ఎనిమిది భాషల్లో కనిపిస్తోంది. భార‌తీయ భాష‌ల‌తో పాటు కొరియ‌న్‌, చైనీస్‌ లాంగ్వేజెస్‌లో త్రిప్తి డిమ్రి పేరును రివీల్ చేశారు. అయితే ఈ ఎనిమిది భాషల్లో సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది.  

ఇది కూడా చూడండి: Ind Vs Eng: రోహిత్ వారసుడిగా గిల్.. ఇంగ్లాండ్ టూర్ కోసం టెస్టు జట్టును ప్రకటించిన బీసీసీఐ!

ఇది కూడా చూడండి: Crime: రూ.25 వేల అప్పు కోసం 12 ఏళ్ల బాలుడు బలి.. చంపి పాతరేశారు

గౌరవంగా ఉందని..

స్పిరిట్ మూవీలో హీరోయిన్‌గా తనకు ఛాన్స్ ఇచ్చినందుకు త్రిప్తి డిమ్రి ఆనందం వ్యక్తం చేసింది. ఈ జ‌ర్నీలో మీరు నన్ను మరోసారి నమ్మినందుకు రుణపడి ఉంటాను. మీ విజన్‌లో నేను భాగం కావడం గౌరవంగా ఉందని సందీప్ వంగాను ట్యాగ్ త్రిప్తి ట్యాగ్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్‌లు వైరల్ అవుతున్నాయి. 

ఇది కూడా చూడండి: MLC Kavitha: కవిత చెప్పిన ఆ దెయ్యాలు ఈ ముగ్గురేనా?.. వారికి కవిత అంటే ఎందుకు కోపం?

త్రిప్తి డిమ్రి సందీప్ వంగా యానిమల్ మూవీలో బోల్డ్ పాత్రలో నటించింది. ఈ సినిమాతో త్రిప్తి డిమ్రి ఒక్కసారిగా నేషనల్ క్రష్‌గా మారిపోయింది. ఈ సినిమా హిట్ కావడంతో త్రిప్తికి వరుస ఆఫర్లు వచ్చాయి. ప్రస్తుతం బాలీవుడ్‌లో కూడా కొన్ని సినిమాలకు సైన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీలో దీపికా పదుకుణే హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ దీపికా ప్లేస్‌లో త్రిప్తి వచ్చింది. 
Advertisment
Advertisment
తాజా కథనాలు