/rtv/media/media_files/2025/05/25/3Z4GOZVuB5Ny6rQszLqJ.jpg)
KTR-KCR-and-Kavitha
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు ఆయన కూతురు, ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ ఇష్యూ ఇప్పుడు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ క్రమంలో కవిత కొత్త పార్టీ పెట్టనున్నారనే వార్తలు కూడా గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఆయన కుమారుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందన్న విషయం అర్థం కాక పార్టీ కేడర్ తలలు పట్టుకుంటున్నారు.కాగా పార్టీ లో జరుగుతున్న అంశాలపై చర్చించేందుకు కేటీఆర్ ఫాంహౌజ్ కు వెళ్లి నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Wine: ఈ వైన్ రోజుకీ ఒక సిప్ తాగితే.. కలిగే ప్రయోజనాలు తెలిస్తే తాగకుండా ఉండరు
KTR Meets KCR Discussion On Kavitha
కల్వకుంట్ల కవిత తండ్రి కేసీఆర్‌కు లేఖ రాయటం.. పార్టీలోని కొంతమందిని విమర్శించడం సర్వత్రా చర్చనీయంశమైంది. ‘ కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి’ అని కవిత అనడంతో ఇప్పుడు పార్టీలో తీవ్ర చర్చ నడుస్తోంది. అసలు కేసీఆర్ చుట్టూ ఉన్న దయ్యాలు ఎవరనే చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే కేటీఆర్.. కేసీఆర్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌ను కలిశారు. బీఆర్ఎస్‌లో తాజా రాజకీయ పరిణామాలపై ఆయనతో చర్చిస్తున్నారు. కవిత లేఖతో పాటు,కొత్త పార్టీ పెట్టనున్నారనే ప్రచారం, కాళేశ్వరం నోటీసులు తదితర అంశాలపై ఇద్దరూ సుదీర్ఘంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాల కోసం ఈనెల 28న కేటీఆర్ లండన్, అమెరికాలోనూ పర్యటించనున్నారు. ఈ విషయాలు కూడా కేటీఆర్ చర్చంచే అవకాశం ఉంది.
ఇది కూడా చూడండి: Spirit Movie: దీపికా ఔట్.. యానిమల్ బ్యూటీ ఇన్.. ప్రభాస్‌తో రొమాన్స్‌కి బోల్డ్ బ్యూటీ
మరోవైపు జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆ రోజు చేయాల్సిన పనుల గురించి కూడా మాట్లాడేందుకు కేటీఆర్ కేసీఆర్‌తో భేటీ అయినట్లు సమాచారం. పార్టీ పరంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణపై కార్యాచరణ రూపొందించేందుకు గాను ఆయన బేటీ అయినట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: PM Modi-CM Revanth: ఆ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వండి.. మోదీకి సీఎం రేవంత్ రిక్వెస్ట్!
ఇది కూడా చూడండి: Pregnant Woman Dies: హాస్పిటల్ సిబ్బంది తప్పుతో 2 ప్రాణాలు బలి.. ఏం జరిగిందంటే?
brs-working-president-ktr | brs-kavitha | brs mlc kavitha | brs | kcr | brs party president | brs party kcr