Covid 19: విజృంభిస్తున్న కోవిడ్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకు ప్రమాదమే

దేశంలో కోవిడ్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ఈ టైంలో ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం వంటివి చేయాలి. అలాగే ఇమ్యూనిటీ పవర్‌ పెరిగే పదార్థాలు తీసుకోవాలని అంటున్నారు.

New Update
Corona Care: కరోనాతో కలవరం వద్దు.. ఈ జాగ్రత్తలు పాటించండి..!

Covid 19

దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ, రాజస్థాన్, తమిళనాడు, కేరళ, కర్ణాటకలో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ ఏడాది కోవిడ్‌ తొలి మరణం కూడా కర్ణాటకలో నమోదైంది. శ్వాస సమస్యలతో ఇబ్బంది పడుతున్న 85 ఏళ్ల వ్యక్తి కర్ణాటకలో మృతి చెందాడు. దీంతో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రతీ ఒక్కరూ కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

చల్లని నీటితో కాకుండా..

కరోనా రాకుండా ఉండాలంటే ముందుగా శుభ్రత పాటించాలి. బయటకు వెళ్లి వచ్చిన వెంటనే చేతులు, కాళ్లు అన్ని కూడా శుభ్రం చేసుకోవాలి. చల్లని నీరు కంటే వేడి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల వైరస్ చనిపోతుంది. అలాగే శానిటైజర్‌ను తప్పకుండా వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లినప్పుడు మాస్క్ తప్పనిసరి పెట్టుకోండి. 

ఇది కూడా చూడండి: Spirit Movie: దీపికా ఔట్.. యానిమల్ బ్యూటీ ఇన్.. ప్రభాస్‌తో రొమాన్స్‌కి బోల్డ్ బ్యూటీ

రోగనిరోధక శక్తిని పెంచే వాటిని ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్ సి, విటమిన్ ఈ, సాల్మన్ ఫిష్ వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. బయటకు వెళ్లేటప్పుడు సోషల్ డిస్టెన్స్ పాటించాలి. రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోకుండా తొందరగా పడుకోవడం అలవాటు చేసుకుంటే.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మీ బాడీలో ఏమైనా మార్పులు కనిపిస్తే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలి.

ఇది కూడా చూడండి: PM Modi-CM Revanth: ఆ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వండి.. మోదీకి సీఎం రేవంత్ రిక్వెస్ట్!

జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే పోషకాలు ఉండే ఫుడ్ తీసుకుంటూ ఐసోలేషన్‌లో ఉండాలి. అన్నింటికంటే ముఖ్యంగా మధుమేహం, క్యాన్సర్, గుండె పోటు, కిడ్నీ వంటి దీర్ఘకాలిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు బయటకు వెళ్లకపోవడం మంచిది. అలాగే ఇంటిని కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటే కోవిడ్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని నిపుణులు అంటున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు