/rtv/media/media_files/2025/05/25/glhHNZIzs7EP2s93GEQ6.jpg)
Ukraine launched a drone attack on Putin's helicopter
రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా ఓ సంచలన అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. పుతిన్ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్ డ్రోన్ దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. రాత్రిపూట కుర్స్క్ ప్రాంతాలోని ఆయన హెలికాప్టర్‌లో ప్రయాణిస్తుండగా ఈ దాడికి యత్నించింది. దీంతో వెంటనే అప్రమత్తమైన రష్యన్ ఆర్మీ ఉక్రెయిన్ డ్రోన్‌ను కూల్చివేసింది. అధ్యక్షుడు పుతిన్ ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు.
Also read: బంగ్లాదేశ్‌ను అమెరికాకు అమ్మేస్తున్నారు.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు
ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో పుతిన్ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్ దాడికి యత్నించడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. పుతిన్ హెలికాప్టర్‌పై డ్రోన్ దాడి చేసేందుకు ఉక్రెయిన్ యత్నించిందని రష్యన్ అధికారులు కూడా తెలిపారు. రష్యన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈ దాడిని ఎదుర్కొందని పేర్కొన్నారు.
Also Read: హార్వర్డ్ యూనివర్సిటీపై ట్రంప్ మరో బాంబ్.. వాళ్ల వివరాలు కావాలని డిమాండ్
ఇదిలాఉండగా రష్యా కూడా ఉక్రెయిన్‌పై భీకర దాడులకు దిగింది. పలు నగరాలపై 367 డ్రోన్లు, క్షిపణులను ప్రయోగించింది. రాత్రిపూట జరిగిన ఈ దాడుల్లో 13 మంది ఉక్రెయిన్ పౌరులు మృతి చెందారు. చాలావరకు రష్యా దాడులను ఉక్రెయిన్ తిప్పికొట్టింది. 266 డ్రోన్లు, 45 క్షిపణులను ఉక్రెయిన్ కూల్చివేసింది. కానీ ఈ దాడుల్లో కానీ కైవ్, ఖార్కివ్, మైకోలైవ్, టెర్నోపిల్, ఖ్మెల్నిట్స్కీ లాంటి నగరాలు భారీగా నష్టపోయాయి. డజన్ల కొద్ది మంది గాయపడ్డారు. రెండు రోజుల్లోనే రష్యా ఉక్రెయిన్‌పై రెండుసార్లు వైమానిక దాడులకు పాల్పడింది. దీంతో రష్యాపై అమెరికా ఆంక్షలు విధించాలని జెలెన్స్కీ పిలుపునిచ్చారు.
putin | telugu-news | russia-ukraine-war