Pakistanis Arrest: అమెరికాలో పాక్ పౌరుల అరెస్ట్.. వాళ్లు ఏం చిల్లర పని చేశారో తెలుసా?

అక్రమంగా అమెరికా వీసాలు ఇప్పిస్తున్న ఇద్దరు పాకిస్తానీలను ఎఫ్‌బీఐ అధికారులు అరెస్టు చేశారు. వీరు అమెరికాలో ఉద్యోగాలు సృష్టించినట్లు ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి అక్రమంగా వీసాలు పొందేవారు. వాటిని విదేశీయులకు పెద్ద మొత్తంలో అమ్ముకునే వారు.

New Update
Pakistanis arrest in US

టెక్సాస్‌ నగరంలో పాకిస్థాన్‌కు చెందిన అబ్దుల్‌ హది ముర్షిద్‌ (39), మహమ్మద్‌ సల్మాన్‌ (35)లను ఎఫ్‌బీఐ అధికారులు అరెస్టు చేశారు. వీరు అమెరికాలో ఉద్యోగాలు సృష్టించినట్లు ఫేక్ డాక్యుమెంట్స్ చూపించి అక్రమంగా వీసాలు పొందేవారు. వాటిని విదేశీయులకు పెద్ద మొత్తంలో అమ్ముకునే వారు. ఇందుకు అడ్డదారిలో ఈబీ-2, ఈబీ-3, హెచ్‌1బీ వీసా ప్రోగ్రామ్‌లను ఉపయోగించేవారు. అమెరికన్లకే ఉద్యోగాలు ఇస్తున్నట్లు.. లేబర్‌ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన అన్ని నిబంధనలు పాటిస్తున్నట్లున్న ఫేక్ జాబ్ నోటిఫికేషన్లు, పత్రికల్లో ప్రకటనలు ఇచ్చేవారు. ఒక్కసారి అక్కడి నుంచి అనుమతులు వచ్చిన తర్వాత.. వారు వీసా కోరుకుంటున్న వారి కోసం గ్రీన్‌కార్డులను మంజూరు చేయాలని అమెరికా ఇమ్మిగ్రేషన్‌ విభాగాన్ని దరఖాస్తు చేసేవారు.

Also read: BIG BREAKING: ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులు.. 367 డ్రోన్లు, మిస్సైల్స్

Also Read :  రెండు ముక్కలుగా GHMC.. రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం?

Two Pakistanis Arrested In US

ఇలా అక్రమంగా పొందిన వీసాలను విదేశీయులకు విక్రయించి డబ్బు సంపాదిస్తున్న ఇద్దరు పాకిస్థాన్‌ జాతీయులను అమెరికా ఎఫ్‌బీఐ అధికారులు అదుపులోకి తీసుకొన్నారు. ఈ విషయాన్ని ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాశ్‌ పటేల్‌ వివరించారు. విచారణలో ముర్షిద్‌ చట్టవిరుద్ధంగా అమెరికా పౌరసత్వం పొందేందుకు యత్నించినట్లు తేలింది. వీరు కొన్ని సంవత్సరాల నుంచి ఈ దందా చేస్తున్నారని ఎఫ్‌బీఐ డల్లాస్‌ స్పెషల్ ఏజెంట్‌ ఒకరు పేర్కొన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా కస్టడీకి ఇవ్వాలని అధికారులు కోరారు. దీనిపై ఈ నెల 30న తదుపరి విచారణ జరగనుంది. వీరు దోషులుగా తేలితే దాదాపు 20 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

Also Read :  ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ.. గంగుల కమలాకర్ సంచలన ప్రకటన!

Also Read :  తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. మూడు రోజుల పాటు వర్షాలు దంచుడే దంచుడు!

america | fraud | pakistan | usa visa | latest-telugu-news | arrested

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు