/rtv/media/media_files/2025/05/25/sIWXEi0OUNoE279woxYl.jpg)
Taj Mahal hoax bomb threat email traced to Kerala, sparks security scare
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో ఉన్న తాజ్‌మహల్‌కు మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆర్‌డీఎక్స్‌తో తాజ్‌మహల్‌ను పేల్చేస్తామని కేరళ నుంచి అధికారులకు ఈ మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తాజ్‌మహాల్ వద్ద హై అలర్ట్ ప్రకటించారు.
Also Read: విజృంభిస్తున్న కోవిడ్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకు ప్రమాదమే
Tajmahal Has Bomb Threat
పోలీసులు, బాంబు నిర్వీర్యం దళం, డాగ్ స్క్వాడ్, భారత పురావస్తు సర్వే (ASI) అధికారులు, CISF భద్రతా దళం మూడు గంటల పాటు తాజ్‌మహల్ ప్రాంగణంలో తనిఖీలు చేశారు. కానీ అక్కడ ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించలేదు. దీంతో తాజ్‌మహల్ పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టిదిట్టం చేశారు.
Also Read: పహల్గాం బాధిత మహిళల్లో ఆ లక్షణాలు లేవు.. బీజేపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్
ఉత్తరప్రదేశ్ టూరిజం శాఖకు, ఢిల్లీ పోలీసులకు గుర్తు తెలియని మెయిల్ ఐడీ నుంచి తాజ్‌మహల్‌కు బెదిరింపు సందేశం వచ్చింది. ఆర్‌డీఎక్స్ బాంబుతో తాజ్‌మహల్‌ను పేల్చేస్తామని అందులో హెచ్చరించారు. రంగంలోకి దిగిన పోలీసులు దీనిపై విచారణ ప్రారంభించారు. చివరికి ఇది ఫేక్ ఈమెయిల్ అని తేలింది. సైబర్ సెల్ పోలీస్ స్టేషన్‌లో కూడా దీనిపై కేసు నమోదైంది. ప్రస్తుతం పోలీసులు నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు.
Agra, Uttar Pradesh: A threatening email from Kerala warned of an RDX blast at the Taj Mahal. Security agencies launched a three-hour search, found no suspicious items, and issued a high alert. A cyber cell case was filed under the direction of DCP City.
— IANS (@ians_india) May 25, 2025
DCP City Sonam Kumar… pic.twitter.com/gKpFjIfgwz
Also Read: బంగ్లాదేశ్‌లో ఉగ్రవాదుల పాలన..షేక్ హసీనా సంచలన కామెంట్స్!
Also Read: పాక్‌కు దెబ్బ మీద దెబ్బ.. 32 మంది సైనికులు హతం!
taj-mahal | telugu-news | national-news | bomb-threat | rtv-news