ఎమ్మెల్సీ కవిత వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్పందించారు. ఇప్పటికే ఈ అంశంపై కేటీఆర్ రియాక్ట్ అయ్యారన్నారు. ఎవరైనా లేఖలు రాయొచ్చన్నారు. కానీ బహిరంగ లేఖలు రాయడం కరెక్ట్ కాదన్న కేటీఆర్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తానన్నారు. తాము కేసీఆర్ సూచించిన బాటలో నడుస్తామని స్పష్టం చేశారు. ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చన్నారు. కానీ కేసీఆర్ కూతురిగా కవిత పెట్టే పార్టీకి ఎంత వాల్యూ ఉంటుందో చూడాలన్నారు. ఇదంతా ఊహాగానాలన్నారు.
ఇది కూడా చదవండి: BIG BREAKING: అలా చేస్తేనే పార్టీలో ఉంటా.. కేసీఆర్ కు కవిత పెట్టిన 6 కండిషన్లు ఇవే!
కవిత లేఖపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సంచలన వ్యాఖ్యలు..
— ChotaNews App (@ChotaNewsApp) May 25, 2025
కేసీఆర్ కుమార్తెగా కవిత పార్టీ పెడితే.. ఎంత వాల్యూ ఉంటుందో చూడాలి. కవిత పార్టీ పెట్టడం కేవలం ఊహాగానాలే
అంతర్గత విషయాలు బహిరంగంగా మాట్లాడొద్దు అన్న కేటీఆర్ మాటలతో ఏకీభవిస్తున్నాను.
కేసీఆర్ ఆదేశానుసారం నడిచే… pic.twitter.com/L5FiOSDGWo
కవిత ఇష్యూపై స్పందించని హరీష్ రావు..
ఈ రోజు మరో బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు ప్రెస్ మీట్ నిర్వహించారు. అయితే.. కవిత అంశంపై ఆయన మాట్లాడతారని అంతా భావించారు. కానీ ప్రాజెక్టులు, నీటి అంశాలకు మాత్రమే పరిమతమయ్యారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ నష్టపోతోందని ఫైర్ అయ్యారు. కవిత అంశంపై ఒక్క మాట కూడా మాట్లాడకుండానే ఆయన తన ప్రెస్ మీట్ ను ముగించారు. ఇదిలా ఉంటే.. ఈ రోజు కేసీఆర్ తో కేటీఆర్ సమావేశమయ్యారు. కవిత అంశంపై వీరిద్దరు చర్చించనున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: MLC Kavitha: కవిత చెప్పిన ఆ దెయ్యాలు ఈ ముగ్గురేనా?.. వారికి కవిత అంటే ఎందుకు కోపం?
(telugu-news | telugu breaking news | latest-telugu-news | kalvakuntla-kavitha | brs mla gangula kamalakar)