SRH vs KKR: సన్‌రైజర్స్ విధ్వంసం.. కేకేఆర్‌ టార్గెట్‌ 279 పరుగులు

కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ విధ్వంసం సృష్టించింది. 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 278 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.హెన్రిచ్ క్లెసెన్‌ సెంచరీతో చెలరేగిపోయాడు. 105 పరుగులు చేసి కోల్‌కతాకు చెమటలు పట్టించాడు.

New Update
Sun Risers Hyderabad Scored 278 runs against KKR in ipl 2025

Sun Risers Hyderabad Scored 278 runs against KKR in ipl 2025

కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌ రైజర్స్ హైదరాబాద్‌ విధ్వంసం సృష్టించింది. 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 278 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఇది IPLలో మూడో అత్యధిక స్కోర్‌ కావడం మరో విశేషం. హెన్రిచ్ క్లెసెన్‌ సెంచరీతో చెలరేగిపోయాడు. 105 పరుగులు చేసి కోల్‌కతాకు చెమటలు పట్టించాడు. ఇక హెడ్ 72 పరుగులు చేశాడు. నరైన్ 2, వైభవ్ ఒక వికెట్‌ తీశారు. కోల్‌కతా గెలవాలంటే 279 పరుగులు చేయాలి. 

Also Read: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే (VIDEO)

వైభవ్‌ అరోరా వేసిన ఇన్నింగ్స్‌లో మొదటి ఓవర్‌లో రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత నుంచి స్కోర్‌ పరుగులు పెట్టింది. వైభవ్‌ వేసిన మూడో ఓవర్‌లో హెడ్‌ రెండు సిక్సులు, ఓ ఫోర్ బాదాడు. హర్షిత్‌ బౌలింగ్‌లో 3 ఫోర్లు కొట్టాడు. నరైన్‌ బౌలింగ్‌లో రెండు సిక్స్‌లు కొట్టిన అభిషేక్.. ఆ తర్వాత బంతికే ఔటైపోయాడు. ఆ తర్వాత హెడ్ 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. 

Also Read: సంచలన అప్‌డేట్‌.. పుతిన్‌ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్‌ బాంబు దాడి !

క్రీజులోకి వచ్చిన క్లాసెన్‌ కూడా బౌండరీలు బాదాడు. వరుణ్‌ బౌలింగ్‌ మూడు ఫోర్లు కొట్టడంతో 10 ఓవర్లకు స్కోర్‌ 139/1 గా ఉంది. హర్షిత్‌ బౌలింగ్‌లో క్లాసెన్‌ వరుసగా 4,6,6 కొట్టాడు. కేవలం 17 బంతుల్లోనే అర్థ శతకం చేశాడు. ఆ తర్వాత నరైన్ బౌలింగ్‌లో హెడ్‌ ఔటయ్యాడు. క్లాసెన్, ఇషాన్ కిషన్ కలిసి జోరు కొనసాగించారు. దీంతో 18 ఓవర్లకు స్కోర్ 250 దాటింది.  

telugu-news | IPL 2025 | sun-risers-hyderabad 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు