/rtv/media/media_files/2025/05/25/PySFFsCo8NJXzFzHRbg9.jpg)
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన తండ్రి, పార్టీ చీఫ్ కేసీఆర్ కి రాసిన లేఖ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం అయితే పార్టీలో కొంతమంది కోవర్టులున్నారంటూ ఆమె చేసిన కామెంట్స్ మరింత హిట్ ను పెంచేశాయి. ఈ క్రమంలో నిన్న కేటీఆర్ పెట్టిన మీడియా సమావేశంలో ఆ లేఖపై, లేఖలోని అంశాలపై, కవిత వ్యాఖ్యలపై మాట్లడతారని అంతా ఊహించారు కానీ ఎక్కడా కూడా కవిత పేరు ప్రస్తావించకుండా వ్యూహాత్మకంగా స్పందించారు. తాజాగా హరీష్ కొద్దిసేపటి క్రితం పెట్టిన ప్రెస్ మీట్ లో కూడా దీనిపై ఎలాంటి రియాక్షన్ లేకుండానే తన ప్రసంగాన్ని ముగించారు. ప్రాజెక్టులు, నీళ్లపై ప్రభుత్వాన్ని ఏకిపారేసిన హరీష్ .. కవిత ఇష్యూపై మాత్రం ఒక్కమాట కూడా మాట్లాడలేదు. దీంతో అసలు ఆ పార్టీలో ఏం జరుగుతుందో అన్న చర్చ జోరుగా నడుస్తోంది.
కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే
తెలంగాణలోని ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వాలు అనేకసార్లు అడ్డుపడ్డాయని, కోర్టులు, ట్రిబ్యునల్స్ లో అనేక కేసులు వేశాయని హరీష్ రావు ఆరోపించారు. గోదావరి - బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఏ రాష్ట్రంలోనైనా కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ అనుమతి తప్పనిసరి అని వెల్లడించారు. నియమ, నిబంధనలేవీ పాటించకుండానే గోదావరి - బనకచర్ల ప్రాజెక్ట్ ఎలా నిర్మిస్తారని హరీష్ నిలదీశారు. కేంద్రం జుట్టు తమచేతిలో ఉందని రాత్రికి రాత్రే ప్రాజెక్ట్ రూపకల్పన చేసి, టెండర్లు పిలిచి కేంద్రం ముందు పెట్టారని హరీష్ మండిపడ్డారు.