Miss World 2025 : దేశ ప్రతిష్టను దిగజార్చారు..మాజీమంత్రి సబితారెడ్డి ఆగ్రహం

మిస్ వరల్డ్ పోటీల పేరుతో దేశ ప్రతిష్టను దిగజార్చేవిధంగా ప్రవర్తించారని మాజీమంత్రి సబితారెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల్లోపాల్గొన్న వారి పట్ల ఆసభ్యంగా ప్రవర్తించారన్న విమర్శలపై సబితారెడ్డి స్పందించారు.

New Update
Sabitha Indra Reddy

Sabitha Indra Reddy

Miss World 2025 : మిస్ వరల్డ్ పోటీల పేరుతో దేశ ప్రతిష్టను దిగజార్చేవిధంగా ప్రవర్తించారని మాజీమంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీల నేపథ్యంలో అందాల బామల పట్ల పలువురు ఆసభ్యంగా ప్రవర్తించారని విమర్శలు వెలువడుతున్న తరుణంలో సబితారెడ్డి స్పందించారు. సబితా ఇంద్రారెడ్డి ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలలో, తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ ప్రపంచ వ్యాప్తంగా రాష్ట్రం , భారతదేశ ప్రతిష్టను దిగజార్చిందని మండిపడ్డారు. హైదరాబాదులో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని చెప్పుకున్న అందాల పోటీలపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ చేసిన సంచలన ఆరోపణలు రాష్ట్ర ప్రతిష్టపై సవాలు విసురుతున్నాయని, ఈ ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిందిగా డిమాండ్  చేశారు.

Also Read: విజృంభిస్తున్న కోవిడ్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకు ప్రమాదమే

 మధ్య వయసు ఉన్న పురుషులను ఆనందపెట్టాలని తమపై ఒత్తిడి తీసుకువచ్చారని, తమను వేశ్య లాగా చూశారంటూ మిల్లా మ్యాగీ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ పోటీల నుంచి మధ్యలోనే తప్పుకుని స్వదేశానికి వెళ్లిపోయారని చెప్పారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన మిస్ వరల్డ్ పోటీల్లో ఇలాంటి ఘటనలు జరగడం.. అది కూడా మన రాష్ట్రంలో జరిగినప్పుడే తెరపైకి రావడం ప్రభుత్వ తీరుపై, నిర్వాహకుల తీరుపై అనేక అనుమానాలను కలిగిస్తున్నదని సబితా రెడ్డి అన్నారు.   

 Also Read: పహల్గాం బాధిత మహిళల్లో ఆ లక్షణాలు లేవు.. బీజేపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్

చాలా గ్రాండ్‌గా ఈ వేడుకలు నిర్వహిస్తామని, పోటీదారులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూస్తామని, ఈ పోటీలతో పెట్టుబడులు వస్తాయని, యువతకు ఉద్యోగాలు వస్తాయంటూ ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు.. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇది కేవలం నిర్వాహకులపై చేసిన ఆరోపణ కాదని, మన రాష్ట్ర రాజధానిలో పోటీలు జరుగుతున్నాయి కాబట్టి ఇది మన రాష్ట్ర ప్రతిష్టకు, మన దేశ పరువు, ప్రతిష్టలకు సంబంధించిన విషయమని ఆమె అన్నారు. దీనిపై వెంటనే విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు.

Also Read :  అలా చేస్తేనే పార్టీలో ఉంటా.. కేసీఆర్ కు కవిత పెట్టిన 6 కండిషన్లు ఇవే!

ప్రపంచ దేశాల నుంచి వచ్చిన యువతులను వేధించింది ఎవరు, ఆ వేధింపులకు కారణమైంది ఎవరు?, ఆ వ్యక్తులు ఎవరు అనే విషయాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనిపై వెంటనే రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించి విచారణ చేపట్టాలన్నారు. అలాగే జాతీయ మహిళా కమిషన్ కూడా ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని, రాష్ట్ర, దేశ పరువు ప్రతిష్టలను కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రపంచ దేశాల నుంచి పోటీల కోసం వచ్చిన యువతులతో అసభ్యంగా ప్రవర్తించిన వారు, వారితో అసభ్యకరమైన పనులు చేయించాలని ప్రయత్నించిన వారు ఎంతటి వారైనా వారిపై కఠిన చర్యలు తీసుకొవాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ప్రభుత్యం స్పందించాలన్నారు.

Also Read: విజృంభిస్తున్న కోవిడ్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకు ప్రమాదమే

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు