ఫామ్ హౌజ్ లో KCRతో కేటీఆర్ భేటీ.. కవిత విషయంలో కీలక నిర్ణయం?

ఎర్రవల్లిలోని ఫామ్ హౌజ్ కు వెళ్లిన కేటీఆర్ తండ్రి కేసీఆర్ తో సమావేశం అయ్యారు. కవిత విషయంపైనే వీరు ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో కవిత విషయంలో వీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.

New Update

బీఆర్ఎస్‌ పార్టీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కవిత నెక్ట్స్ స్టెప్ ఏంటి? అన్న అంశంపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ చీఫ్‌ కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ కావడం మరిం ఉత్కంఠ రేపుతోంది. కొద్ది సేపటి క్రితం కేటీఆర్ ఎర్రవెల్లి ఫాంహౌజ్ కు వెళ్లారు. తాజా రాజకీయ పరిణామాలపై కేసీఆర్ తో సమాలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కవిత లేఖ వ్యవహారంపై వీరిద్దరి మధ్య సీరియస్ డిస్కషన్ సాగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read :  మావోయిస్టు అగ్రనేతల మృతదేహాల తరలింపులో అడ్డంకులు

Also Read :  తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. మూడు రోజుల పాటు వర్షాలు దంచుడే దంచుడు!

కేసీఆర్ సీరియస్?

లేఖ రాసింది తానేనని ఇప్పటికే కవిత ప్రకటించారు. కానీ దాన్ని లీక్ చేయడంపై మండిపడ్డారు. కేసీఆర్ దేవుడు అని.. కానీ, ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయని ఆమె వ్యాఖ్యానించారు. దీంతో కవిత వ్యాఖ్యలు తెలంగాణ పాలిటిక్స్ లో తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. ఆమె పార్టీలో ఉంటారా? లేక కొత్త పార్టీ పెడతారా? అన్న అంశంపై డిస్కషన్ సాగుతోంది. కవిత వ్యవహారంపై కేసీఆర్ సైతం సీరియస్ గా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై జోరుగా చర్చ సాగుతోంది. 

Also Read :  గాలివానకు కుప్పకూలిన పోలీస్‌స్టేషన్.. SI మృతి

Also Read :  Covid 19: విజృంభిస్తున్న కోవిడ్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకు ప్రమాదమే

 

Ktr | kalvakuntla-kavitha | latest-telugu-news | telugu-news | breaking news in telugu | today-news-in-telugu | latest telangana news | telangana news live updates | telangana news today | kalvakuntla-chandrashekar-rao | brs

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు