Police Officer: గాలివానకు కుప్పకూలిన పోలీస్‌స్టేషన్.. SI దుర్మరణం

ఉత్తరప్రదేశ్‌ ఘజియాబాద్‌‌లోని ఆదివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి ACP ఆఫీస్ పైకప్పు కూలిపోయింది. డ్యూటీలో ఉన్న సబ్ ఇన్‌స్పెక్టర్ వీరేంద్ర మిశ్రా ఆఫీస్‌లోనే చిక్కుకుపోయారు. 58 ఏళ్ల మిశ్రా బిల్డింగ్ శిథిలాలు మీద పడి ప్రాణాలు కోల్పోయారు.

New Update
Ghaziabad ACP office

గతకొన్ని రోజులుగా ఉత్తరభారత్‌ని ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వేగంగా వీచే ఈదురుగాలకు అనేక చెట్లు, భవనాలు, హోడింగ్స్ నేలమట్టం అయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌ అంకుర్ విహార్‌లోని ఆదివారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి ACP ఆఫీస్ పైకప్పు కూలిపోయింది. డ్యూటీ మీద ఆఫీస్‌‌లో ఉన్న సబ్-ఇన్‌స్పెక్టర్ వీరేంద్ర మిశ్రా అందులోనే చిక్కుకుపోయారు. 58 ఏళ్ల SI మిశ్రా బిల్డింగ్ శిథిలాలు మీద పడి ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. 

Also Read :  తెలంగాణ ఎమ్మెల్యే హత్యకు ఆంధ్రాలో టెర్రరిస్టుల ప్లాన్!!

Police Officer Dies After ACP Office Roof Collapses

Also Read :  పవన్‌ ఫ్యాన్స్‌ గెట్‌ రెడీ.. OG రిలీజ్‌ డేట్‌ ప్రకటించిన మేకర్స్‌

Also Read :  కొచ్చి తీరంలో హై అలర్ట్‌..మునిగిన నౌకలో ప్రమాదకర రసాయనాలు..?

అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో అదనపు పోలీసు కమిషనర్ అలోక్ ప్రియదర్శి దగ్గర వీరేంద్ర మిశ్రా పర్సనల్ అసిస్టెంట్‌గా నియమించబడ్డారు. పైకప్పు కూలిపోయిన వెంటనే ఆయన్ని బయటకు తీసి హాస్పిటల్‌కు తరలించాలని చూశారు. అప్పటికే ఆయన స్పాట్‌లోనే చనిపోయారు. ఎటావా జిల్లాలోని అతని కుటుంబానికి సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు.

Also Read :  ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం

police-officer | delhi | latest-telugu-news | thunderstorm | delhi heavy rains

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు