/rtv/media/media_files/2025/05/25/bgIjQVuxUMydVeAXitXO.jpg)
Monsoon
నైరుతి రుతుపవనాలు ఆదివారం దేశంలోకి విస్తరించాయి. తూర్పు మధ్య, పశ్చిమ మధ్య, అరేబియా సముద్రంతో పాటు పలు ప్రాంతాలకు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలకు, గోవా అంతటా విస్తరించాయి. అలాగే మహారాష్ట్ర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్, ఉత్తర, పశ్చిమ మధ్య బంగాళఖాతంలో పలు ప్రాంతాలకు విస్తరించినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Also Read: దేశ ప్రతిష్టను దిగజార్చారు..మాజీమంత్రి సబితారెడ్డి ఆగ్రహం
ఉత్తర అంతర్గత కర్ణాటక, మరఠ్వాడ వద్ద అల్పపీడనం ఆదివారం ఐఎస్‌టీ వద్ద కొనసాగుతోందని తెలిపింది. రాబోయే 24 గంటల్లో నెమ్మదిగా తూర్పు వైపునకు కదిలి క్రమంగా బలపడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. దీని ప్రభావం వల్ల తెలంగాణలోని పలు జిల్లాలో రాగల మూడు రోజుల పాటు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.
Also Read: కొచ్చి తీరంలో హై అలర్ట్..మునిగిన నౌకలో ప్రమాదకర రసాయనాలు..?
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించారు. ఏపీలో కూడా రాగల 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంగా రుతుపవనాలు కేరళకు జూన్ 1వ తేదీన వస్తాయి. కానీ ఈ ఏడాది ముందుగానే వచ్చేశాయి. దాదాపుగా ఎనిమిదేళ్ల తర్వాత నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ రుతుపవనాల వల్ల తెలుగు రాష్ట్రాలకు తుపాను ముప్పు ఉంది. ఈ రుతుపవనాల వల్ల రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాలకు కూడా మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి.
Also Read: అమెరికాలో పాక్ పౌరుల అరెస్ట్.. వాళ్లు ఏం చిల్లర పని చేశారో తెలుసా?
Also Read: ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం
weather | telugu-news | rtv-news | Heavy Rains