Mann ki Baat: పాకిస్తాన్‌పై ప్రతీకారం.. మన్ కీ బాత్‌లో మోదీ సంచలన వ్యాఖ్యలు

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారి పీఎం నరేంద్ర మోదీ నేడు మన్ కీ బాత్‌లో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామని అన్నారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా దేశమంతా ఒక్కటైందన్నారు. ఆపరేషన్ సిందూర్‌తో ప్రపంచానికి భారత్ సత్తా ఏంటో తెలిసిందని తెలిపారు.

New Update
PM Modi's Mann ki baat

PM Modi's Mann ki baat

ఆపరేషన్ సిందూర్ తర్వాత మొదటిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు మన్ కీ బాత్‌లో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామన్నారు. టెర్రరిజానికి వ్యతిరేకంగా దేశమంతా కూడా ఒక్కటైందన్నారు. ఆపరేషన్ సిందూర్‌ను భద్రతా దళాలు సమర్ధవంతంగా నిర్వహించాయని మోదీ తెలిపారు. ఆపరేషన్ సిందూర్‌తో ప్రపంచానికి భారత్ సత్తా ఏంటో తెలిసిందన్నారు.

ఇది కూడా చూడండి: Spirit Movie: దీపికా ఔట్.. యానిమల్ బ్యూటీ ఇన్.. ప్రభాస్‌తో రొమాన్స్‌కి బోల్డ్ బ్యూటీ

ఆపరేషన్ సిందూర్ సైనిక చర్య కాదని..

ఆపరేషన్ సిందూర్ విజయంపై దేశ వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేశారని మోదీ అన్నారు. అత్యాధునిక ఆయుధాలతో భారత్ శత్రువులను ఎదుర్కొంటుందని మోదీ మన్ కీ బాత్‌లో తెలిపారు. ఆపరేషన్ సింధూర్ కేవలం ఒక సైనిక చర్య కాదని, మన దృఢ సంకల్పం, ధైర్యం మారుతున్న భారతదేశం ముఖ ప్రతిబింబం అని అన్నారు.

ఇది కూడా చూడండి: PM Modi-CM Revanth: ఆ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వండి.. మోదీకి సీఎం రేవంత్ రిక్వెస్ట్!

ఈ ఆపరేషన్ సిందూర్‌ను దేశ ప్రజలు కూడా వారి జీవితాల్లో భాగం చేసుకున్నారని మోదీ అన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో పుట్టిన పిల్లలకు సిందూర్ అని నామకరణం చేశారని ప్రశంసించారు. అలాగే మరోవైపు దంతెవాడ ఆపరేషన్ కూడా మోదీ ప్రశంసించారు. జవాన్లు చేసిన సాహసాన్ని గురించి మన్ కీ బాత్‌లో ప్రస్తావించారు. 

ఇది కూడా చూడండి: Pregnant Woman Dies: హాస్పిటల్ సిబ్బంది తప్పుతో 2 ప్రాణాలు బలి.. ఏం జరిగిందంటే?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు