Fake visa: ఫేక్‌ వీసాల వ్యాపారం.. ఇద్దరు పాకిస్థానీయులు అరెస్టు

అమెరికాలో ఫేక్‌ డాక్యుమెంట్స్, ఉద్యోగాలు సృష్టించి అక్రమంగా వీసాలు పొందుతున్న కేటుగాళ్ల గుట్టురట్టయింది. ఆ వీసాలను విదేశీయులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్న ఇద్దరు పాకిస్థానీయులు అరెస్టయ్యారు.

New Update
2 Pakistani Nationals Arrested In USA For Visa Fraud, Know details

2 Pakistani Nationals Arrested In USA For Visa Fraud, Know details

అమెరికాలో ఫేక్‌ డాక్యుమెంట్స్, ఉద్యోగాలు సృష్టించి వాటితో అక్రమంగా వీసాలు పొందే వ్యవహారం గుట్టుచప్పుడు కాకుండా జరుగుతోంది. అక్రమంగా పొందిన వీసాలను విదేశీయులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్న ఇద్దరు పాకిస్థానీయులను అమెరికా ఎఫ్‌బీఐ అధికారులు అరెస్టు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. టెక్సాస్‌లోని పాక్‌కు చెందిన అబ్దుల్ హది ముర్షిద్ (39), మహ్మద్ సల్మాన్ (35) ఫేక్ డాక్యుమెంట్లు, ఉద్యోగాలు సృష్టించి అక్రమంగా వీసాలు పొందుతుండేవారు. 

Also Read: కేరళ తీరంలో మునిగిపోయిన భారీ షిప్.. 24 మంది సిబ్బంది

2 Pakistani Nationals Arrested In USA

ఆ తర్వాత వాటిని విదేశీయులకు అమ్మి ఎక్కువ మొత్తంగా సొమ్ము చేసుకునేవారు. దీనికోసం ఈబీ2, ఈబీ3, హెచ్‌1బీ వీసా ప్రొగ్రామ్‌లను వాడేవారు. అమెరికన్లకే జాబ్స్ ఇస్తున్నామని, లేబర్‌ శాఖకు సంబంధించిన అన్ని రూల్స్ పాటిస్తున్నట్లు ఫేక్ ఉద్యోగ ప్రకటనలు న్యూస్‌ పేపర్లలో పబ్లిష్ చేయించేవారు. అక్కడి నుంచి పర్మిషన్లు వచ్చాక వీసా కోరుకుంటున్న వాళ్ల కోసం గ్రీన్‌కార్డులను మంజూరు చేయాలని అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగాన్ని కోరుతారు. ఇలా నకిలీ వీసాలు అమ్ముకుంటూ భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసేవారు. 

Also Read: తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు.. RDXతో పేల్చేస్తామన్న దుండగులు

ఎట్టకేలకు వీళ్ల గుట్టు బయటపడటంతో ఎఫ్‌బీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో అబ్దుల్ హది ముర్షిద్ చట్టవిరుద్ధంగా అమెరికా పౌరసత్వం పొందేందుకు యత్నించాడని అధికారులు గుర్తించారు. గత కొన్నేళ్లుగా వీళ్లు ఈ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని తేలింది. ఈ నిందితులను ఇప్పటికే కోర్టులో హాజరుపరిచారు. మే 30 దీనిపై తదుపరి విచారణ జరగనుంది. వీళ్లు దోషులుగా తేలితే దాదాపు 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే ఛాన్స్ ఉంది. 

Also Read: పహల్గాం బాధిత మహిళల్లో ఆ లక్షణాలు లేవు.. బీజేపీ ఎంపీ షాకింగ్ కామెంట్స్

Also Read: బంగ్లాదేశ్‌లో ఉగ్రవాదుల పాలన..షేక్ హసీనా సంచలన కామెంట్స్!

 telugu-news | rtv-news | usa | fake-visa 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు