BIG BREAKING: అలా చేస్తేనే పార్టీలో ఉంటా.. కేసీఆర్ కు కవిత పెట్టిన 6 కండిషన్లు ఇవే!

పార్టీలో ప్రాధాన్యం.. బీజేపీతో పొత్తు పెట్టుకోవద్దు.. ఇలా KCRకు కవిత 6 కండిషన్లు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ కండిషన్లకు ఒప్పుకోకుంటే తనదారి తాను చూసుకుంటానని ఆమె స్పష్టం చేస్తున్నట్లు మీడియా కథనాలు వస్తున్నాయి. పూర్తి వివరాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోండి.

New Update
KCR Kavitha

బీఆర్ఎస్ పార్టీలో కవిత కొనసాగుతారా? లేక తన దారి తాను చూసుకుంటారా? అన్న అంశం ఇప్పుడు తెలంగాణ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తాను తండ్రికి రాసిన లేఖను కొందరు కావాలనే బయట పెట్టారని కవిత బహిరంగంగానే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తన తండ్రి కేసీఆర్ దేవుడని.. కానీ కొందరు దెయ్యాలు ఆయన చుట్టూ ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కవిత. తద్వారా పార్టీలో కీలక స్థానాల్లో ఉన్న కొందరితో కవితకు పడడం లేదని స్పష్టం అవుతోంది. ఇదిలా ఉంటే.. తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కవిత కొన్ని కండిషన్లు పెట్టినట్లు తెలుస్తోంది. వాటికి ఒప్పుకోకుంటే తనదారి తాను చూసుకుంటానని స్పష్టం చేసినట్లు మీడియా కథనాలు వస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ ఈ మేరకు జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయా కథనాల ప్రకారం కేసీఆర్ కు కవిత పెట్టిన 6 కండిషన్ల వివరాలు ఇలా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: BIG BREAKING: ‘బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్’

తగిన ప్రాధాన్యం ఇవ్వాల్సిందే..

తనకు పార్టీలో తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కేసీఆర్ వద్ద కవిత డిమాండ్ పెట్టినట్లు మీడియా కథనాలు వస్తున్నాయి. వర్కింగ్ ప్రెసిడెంట్ లేదా అందుకు సమానమైన హోదా ఇవ్వాలని ఆమె కోరుతున్నట్లు తెలుస్తోంది. ఈ కండిషన్ కు ఒప్పుకోకుంటే తాను పార్టీలో కొనసాగేదే లేదని ఆమె స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. 
ఇది కూడా చదవండి: MLC Kavitha: కవిత చెప్పిన ఆ దెయ్యాలు ఈ ముగ్గురేనా?.. వారికి కవిత అంటే ఎందుకు కోపం?

బీజేపీతో ఎప్పటికీ పొత్తు పెట్టుకోవద్దు..

తనను జైలుకు పంపించి.. ఇబ్బందులు పెట్టిన బీజేపీతో ఎప్పటికీ పొత్తు పెట్టుకోవద్దని కేసీఆర్ కు కవిత స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు వివిధ వేధికలపై కేసీఆర్ తో పాటు ముఖ్య నేతలు స్పష్టం చేయాలని ఆమె కోరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ కు రాసిన లెటర్లోనూ బీజేపీతో పొత్తు ఉంటుందని బయట ప్రచారం జరుగుతున్న విషయాన్ని కవిత ప్రస్తావించిన విషయం తెలిసిందే. 

లీక్ చేసిన వారి పేర్లు బయటపెట్టాలి..

తాను కేసీఆర్ కు రాసిన లేఖ ఎలా బయటకు వచ్చిందో చెప్పాలని పార్టీని కవిత డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నిన్న కేసీఆర్ ఫామ్ హౌజ్ లో ఉన్న ఇద్దరు, ముగ్గురు ముఖ్య నేతలతో కవిత మాట్లాడినట్లు మీడియా కథనాలు వస్తున్నాయి. లీక్ చేసిన వారి పేర్లు బయటపెట్టాలని.. వారిపై చర్యలు తీసుకోవాలని కవిత స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. అప్పటి వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటానని ఆమె చెబుతున్నట్లు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ సాగుతోంది.

వారికి టికెట్లు ఇవ్వొద్దు..

2018 అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోని 7 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులే విజయం సాధించారు. అనంతరం కొన్ని నెలల్లోనే జరిగిన ఎంపీ ఎన్నికల్లో మాత్రం కవిత ఓటమి పాలయ్యారు. అయితే.. కొందరు ఎమ్మెల్యేల వెన్నుపోటు కారణంగానే తాను ఓటమి పాలయ్యానన్నది కవిత వాదన. వీరిలో కొందరిపై చర్యలు తీసుకోవాలని ఆ సమయంలోనే కేసీఆర్ ను కోరినా సీరియస్ గా తీసుకోలేదని కవిత వాపోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా వారిని నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించి కొత్త వారికి అప్పగించాలని కవిత డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

ఆ రెండు జిల్లాల్లో ఫ్రీ హ్యాండ్..

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో తాను సూచించిన వారికే నియోజకవర్గ ఇన్ఛార్జి పదవులు ఇవ్వాలని కవిత డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొన్ని సెగ్మెంట్ల బాధ్యతలను సైతం కూడా తాను సూచించిన వారికే అప్పగించాలన్నది కవిత డిమాండ్ గా తెలుస్తోంది.

జాగృతి నేతలకు పదవులు..

తెలంగాణ ఉద్యమంలో తాను ఏర్పాటు చేసిన తెలంగాణ జాగృతి సంస్థ కీలక పోషించిందని కవిత చెబుతున్నారు. బతుకమ్మ, బోనాలతో తాము తాము చేపట్టిన సంస్కృతిక ఉద్యమం బీఆర్ఎస్ కు కూడా కలిసి వచ్చిందని ఆమె వాదిస్తున్నారు. కానీ, తనకు మినహా జాగృతి నుంచి ఎవరికీ టికెట్లు దక్కలేదని వాపోతున్నట్లు కవిత సన్నిహితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కనీసం 5-10 మంది జాగృతి నేతలకు నియోజకవర్గ ఇన్ఛార్జులుగా బాధ్యతలు ఇప్పగించాలని కవిత డిమాండ్ చేస్తున్నట్లు మీడియాలో చర్చ సాగుతోంది.

telugu-news | latest-telugu-news | telugu breaking news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు