/rtv/media/media_files/2025/05/25/Cca5AIyje9B7UMWIW8lT.jpg)
Coronavirus disease (COVID-19)
Coronavirus disease (COVID-19) : కరోనా మరోసారి తన ప్రతాపం చూపిస్తోంది. దేశవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే కేరళ, కర్ణాటకలో కరోనాతో పలువురు చనిపోగా తాజాగా మహారాష్ర్టలోని థానేలో కరోనాతో మరొకరు చనిపోయారు. థానేలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆసుపత్రిలో కరోనాతో 21 ఏళ్ళ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు కామోర్మోడిటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మృతుడు డయాబెటిస్ సంబంధిత సమస్యలతో గురువారం ఆసుపత్రిలో చేరాడు. శుక్రవారం రాత్రి ఆయనకు కోవిడ్ పరీక్ష చేయగా పాజిటివ్‌గా తేలింది. దీనితో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూనే ఆయన మరణించినట్లు సూపరింటెండెంట్ తెలిపారు.
Also read: Pawan : మీకో దండంరా బాబు.. టాలీవుడ్ పై పవన్ ఫైర్!
ఆదివారం నాటికి థానేలో 8 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.. తాజాగా నమోదైన కేసులతో కలిపి మొత్తం 18 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యులు తెలిపారు. అయితే.. కొత్త వేరియంట్ ప్రమాదకరం కాదని.. వైరస్ లక్షణాలు కనిపించిన వెంటనే సకాలంలో పరీక్షలు చేయించుకొని చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. పరిస్థితి అదుపులో ఉందని.. ప్రజలు భయపడవద్దని అధికారులు వెల్లడించారు.
Also read: Cinema News: పవన్‌పై కుట్రతోనే థియేటర్ల మూసివేత.. ఆ నలుగురే ఇదంతా చేస్తున్నారా!?
ఇదిలా ఉండగా.. కర్ణాటకలో కూడా కరోనాతో ఒక వ్యక్తి మరణించాడు. బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 84 ఏళ్ల వృద్ధుడు శరీరంలోని అవయవాలు ఫెయిల్ అయ్యి చనిపోయాడు. ఆస్పత్రిలో చేరిన తర్వాత నిర్వహించిన పరీక్షలో కోవిడ్-19 పాజిటివ్ గా వచ్చినట్లు తెలిపారు అధికారులు. శనివారం రిపోర్టు రావడంతో చికిత్స మొదలు పెట్టారు. కానీ ..అప్పటికే ఆయన ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వడంతో చనిపోయాడు. ఇదిలా ఉండగా కర్ణాటకలో 38 కేసులు నమోదవ్వగా... అందులో బెంగళూరులోనే 32 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
ఇది కూడా చూడండి: Spirit Movie: దీపికా ఔట్.. యానిమల్ బ్యూటీ ఇన్.. ప్రభాస్‌తో రొమాన్స్‌కి బోల్డ్ బ్యూటీ