Pregnant Woman Dies: హాస్పిటల్ సిబ్బంది తప్పుతో 2 ప్రాణాలు బలి.. ఏం జరిగిందంటే?

హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా గర్భిణీ చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జైపూర్‌లో మే 19న ఆసుపత్రిలో చేరిన మహిళ(23)కు వేరే గ్రూప్ రక్తం ఎక్కించారు.. బ్లడ్‌లో రియాక్షన్ మొదలై ఆమె మే 21న చనిపోయింది. వైద్యులు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారు.

New Update
Pregnant Woman Dies (1)

AI Genarated image

డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా గర్భిణీ చనిపోయింది. ప్రసవం కోసం హాస్పిటల్‌కు వెళ్లగా ప్రాణాలు బలిగొన్నారు సిబ్బంది. మహిళ మృతికి కారణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జైపూర్ ఆసుపత్రిలో 23 ఏళ్ల గర్భిణీ స్త్రీ మరణించింది. టోంక్ జిల్లాకు చెందిన గర్బిణీ మే 12న హిమోగ్లోబిన్ లెవల్స్ చాలా తక్కువగా ఉందని, టీబీ మరియు ఇతర ఆరోగ్య సమస్యలతో సవాయి మాన్సింగ్ ఆసుపత్రిలో చేరిందని అధికారులు తెలిపారు. ఆమె మే 21న మరణించింది. ఆమె బ్లడ్ గ్రూప్‌కు మ్యాచ్ కానీ రక్తం ఎక్కించారని బాధిత మహిళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటుండగానే ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.

మే 19న ఆమె బ్లడ్ గ్రూప్ A+ అని బ్లడ్ బ్యాంక్‌కి రక్త మార్పిడి కోసం వెళ్లారు. ఆమెకు A పాజిటివ్ బ్లడ్ ఎక్కించారు. తర్వాత రోజు ఆమె బ్లడ్ గ్రూప్ B పాజిటివ్ అని తెలిసింది. దీంతో ఆమె రక్తంలో రియాక్షన్ కనిపించింది. నెమ్మది నెమ్మదిగా ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. రక్తం ఎక్కించేటప్పుడు డాక్టర్ సెలవులో ఉన్నానని మీడియాతో చెప్పాడు. ఆమె ఇప్పటికే మిలియరీ టిబి కారణంగా తీవ్ర అనారోగ్యంతో ఉందని అన్నారు. వేరే బ్లడ్ గ్రూప్ రక్తం ఎక్కించడంతో జ్వరం, చలి, హెమటూరియా, టాచీకార్డియా వంటి లక్షణాలు వచ్చాయి. వేరే గ్రూప్ రక్తం ఎక్కించిన విషయం బాధితురాలి ఫ్యామిలీకి తెలియకుండా ఉంచారు హాస్పిటల్ సిబ్బంది. 

pregnant-woman | jaipur | blood group types | blood types | types of blood group | blood-groups | latest-telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు