Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు యువకులు సజీవ దహనం

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ ఆటో ఛార్జింగ్ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు సజీవ దహనమయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

New Update
Two Teens Charred To Death In Fire At E-Rickshaw Charging Station In Delhi

Two Teens Charred To Death In Fire At E-Rickshaw Charging Station In Delhi

 ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ ఆటో ఛార్జింగ్ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు సజీవ దహనమయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వాళ్లని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. షాహ్దారాలోని రామ్‌ నగర్ అనే ప్రాంతంలో ఎలక్ట్రిక్ ఆటోల కోసం ఛార్జింగ్ పాయింట్ ఉంది. 

Also Read: కేరళ తీరంలో మునిగిపోయిన భారీ షిప్.. 24 మంది సిబ్బంది

Fire At E-Rickshaw Charging Station

అక్కడ వాహనాల పార్కింగ్‌తో పాటు గోడౌన్‌గా, చెరకు రసం మిషిన్‌లను ఉంచే స్టోరేజ్‌ హౌస్‌గా చిన్న షెడ్‌ను వాడుతున్నారు. అయితే ఆదివారం ఉదయం 6.40 గంటలకు ఆ షెడ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు గంటకు పైగా శ్రమించారు. అయితే రాత్రి అక్కడ పడుకున్న బ్రిజేష్ (19), మణిరామ్ (18) అనే యువకులు మంటల్లో సజీవ దహనమైనట్లు గుర్తించారు. 

Also Read: తాజ్‌మహల్‌కు బాంబు బెదిరింపు.. RDXతో పేల్చేస్తామన్న దుండగులు

ఎలక్ట్రిక్‌ ఆటోకు ఛార్జింగ్ చేస్తున్నప్పుడు షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో గాయాలపాలైన నలుగురు యువకులు ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్లుగా గుర్తించారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో వాళ్లు చెరకు రసం అమ్ముతూ అక్కడున్న షెడ్‌లో ఉంటున్నారని చెప్పారు. ఇక ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేకుండా, రూల్స్‌కు విరుద్ధంగా గోడౌన్‌ నిర్వహిస్తున్న వినోద్‌ రాథోడ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతోంది. 

Also Read: హార్వర్డ్‌ యూనివర్సిటీపై ట్రంప్ మరో బాంబ్.. వాళ్ల వివరాలు కావాలని డిమాండ్

Also Read: విజృంభిస్తున్న కోవిడ్.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలకు ప్రమాదమే

 telugu-news | rtv-news | fire accident | delhi | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu | breaking news in telugu

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు