🛑LIVE BREAKINGS: మోహన్‌బాబు ఇంటి పనిమనిషి ఆత్మాహత్యాయత్నం!

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

  • Dec 10, 2024 21:42 IST

    మోహన్‌బాబు ఇంటి పనిమనిషి ఆత్మాహత్యాయత్నం!

    మంచు ఫ్యామిలీ రచ్చలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. మోహన్‌బాబు ఇంటి పనిమనిషి ఆత్మాహత్యాయత్నం చేసుకుంది. కెమెరా ఉందని తెలియక మోహన్ బాబు ఇంట్లో జరిగిన రచ్చపై ఆమె సంచలన విషయాలు చెప్పింది. అవి వైరల్ కావడంతో ఒత్తిడికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

    manoj  (2)

    Also Read : https://rtvlive.com/cinema/mohan-babu-house-maid-attempts-suicide-8426287



  • Dec 10, 2024 21:07 IST

    నా గుండెల మీద తన్నావ్.. మోహన్ బాబు

    తన కుటుంబంలో జరుగుతున్న గొడవలపై మోహన్‌ బాబు స్పందించారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న మనోజ్ ఈరోజు గుండెల మీద తంతున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  తాగుడుకి అలవాటు పడి చెడు మార్గంలో వెళుతున్నాడని చెపుతూ ఆడియో సందేశం విడుదల చేశారు మోహన్ బాబు. 

    1

    Also Read : https://rtvlive.com/cinema/actor-mohanbabu-audio-message-about-his-son-manoj-and-fight-8426219



  • Dec 10, 2024 20:40 IST

    మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడి!

    హైదరాబాద్‌లోని జల్‌పల్లిలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. అక్కడ విషయాలపై కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాపై మోహన్ బాబు దైర్జన్యానికి పాల్పడ్డారు. వారి చేతుల్లోని మైకులను లాక్కొని మీడియా ప్రతినిధులపైనే దాడి చేశారు.

    manoj  (1)

    Also Read : https://rtvlive.com/cinema/mohan-babu-attack-on-media-8426150



  • Dec 10, 2024 20:34 IST

    మోహన్ బాబు, మంచు విష్ణుల గన్స్ తీసుకోనున్న పోలీసులు

    మోహన్ బాబు, మంచు మనోజ్ మధ్య కొన్ని రోజులుగా వైరం పెరుగుతుంది. మంగళవారం మంచు మోహన్ బాబు, విష్ణుల నుంచి జూబ్లీహిల్స్ పోలీసులు లైసెన్స్ గన్స్ లను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటికి భారీగా పోలీసులు చేరుకుంటున్నారు.

    moha

    Also Read : https://rtvlive.com/cinema/police-will-take-guns-from-mohan-babu-and-manchu-vishnu-8426101



  • Dec 10, 2024 20:14 IST

    మోహన్ బాబు ఇంటి గేట్‌ను తోసుకుంటూ లోపలికి వెళ్లిన మనోజ్

    హైదరాబాద్ జల్‌పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద హైడ్రామా నడుస్తోంది. తాజాగా ఆయన నివాసానికి చేరుకున్న మంచు మనోజ్.. ఇంటి గేట్లను తోసుకుంటూ తన అనుచరులతో లోపలికి వెళ్లాడు.

    Also Read : https://rtvlive.com/cinema/manchu-manoj-on-aggressive-mode-mohan-babu-8426070



  • Dec 10, 2024 19:25 IST

    ఎక్స్‌రే కోసం వెళ్తే అలాంటి పని చేశాడు.. ఛీ.. ఛీ దుర్మార్గుడు!

    విశాఖ పట్టణం రామ్ నగర్‌లోని కేర్ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ప్రకాష్ అనే ఓ వ్యక్తి ఎక్స్ రే కోసం వెళ్లిన మహిళపై అత్యాచార యత్నం చేశాడు. విషయం తెలుసుకున్న బాధితురాలి బంధువులు నిందితుడు ప్రకాష్‌కి దేహశుద్ది చేశారు.

    Visakha Incident

    Also Read : https://rtvlive.com/cinema/visakhapatnam-incident-women-molestation-at-care-hospital-telugu-news-8425943



  • Dec 10, 2024 19:15 IST

    2024లో భారతీయులు గూగుల్‌లో ఎక్కువగా వెతికినవి ఇవే

    2024 ఏడాదిలో భారతీయులు ఆసక్తిగా సెర్చ్ చేసిన విషయాలను గూగుల్ వెల్లడించింది. ఫస్ట్ రెండు ప్లేసుల్లో క్రికెట్ గురించే గూగుల్‌లో వెతికారట. IPL, T20లు ఉన్నాయి. వరుసగా BJP, ఎలక్షన్ రిజల్ట్స్ 2024, ఒలంపిక్స్ గురించి ఇండియన్స్ ఎక్కువగా గూగుల్లో సెర్చ్ చేశారు.

    Google : ప్రపంచ వ్యాప్తంగా గూగుల్‌ సేవలకు అంతరాయం.. కారణం ఏంటంటే!

    Also Read : https://rtvlive.com/national/these-are-the-most-searched-things-on-google-by-indians-in-2024-8425890



  • Dec 10, 2024 18:11 IST

    AUS vs IND: మూడో టెస్టు.. భారత్‌ తుది జట్టు నుంచి ఆ ఇద్దరు ఔట్!

    ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ఆడబోతున్న భారత్‌లో రెండు పెద్ద మార్పులను హర్భజన్ సింగ్ అంచనా వేశారు. అశ్విన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌‌ తిరిగి తుది జట్టులోకి రావొచ్చని అన్నారు. అలాగే హర్షిత్ రాణా స్థానంలో ప్రసిద్ధ్‌ కృష్ణను తీసుకునే ఛాన్స్‌ ఉందన్నారు.

    Harbhajan Singh

    Also Read : https://rtvlive.com/sports/harbhajan-singh-predicts-two-big-changes-in-india-playing-third-test-against-australia-8425671



  • Dec 10, 2024 17:13 IST

    అమెరికాకు వెళ్లాలనుకునేవారికి షాక్.. భారీగా తగ్గిన వీసాలు

    అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య చాలావరకు తగ్గింది. ఈ ఏడాది ఇండియన్ స్టూడెంట్స్‌కు జారీ చేసే ఎఫ్‌-1 స్టూడెంట్‌ వీసాలు ఏకంగా 38 శాతం తగ్గిపోయాయి. జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య 64,008 మందికే ఈ వీసాలు జారీ అయ్యాయి. 2023లో ఈ సంఖ్య 1,03,485గా ఉంది.

    students2

    Also Read : https://rtvlive.com/international/indian-students-see-38-percent-drop-in-us-f-1-visas-issued-from-jan-to-september-2024-8425414



  • Dec 10, 2024 16:21 IST

    భారత్-ఆస్ట్రేలియా మధ్య బాక్సింగ్ డే టెస్టు.. తొలిరోజు టికెట్లు సోల్డౌట్

    మెల్‌బోర్న్‌ వేదికగా డిసెంబరు 26 నుంచి నాలుగో టెస్టు (బాక్సింగ్ డే టెస్టు) ప్రారంభం కానుంది. ఈ బాక్సింగ్‌ డే టెస్టు టికెట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఈ మ్యాచ్‌కు ఇంకా 15 రోజుల సమయం ఉన్నప్పటికీ ఇప్పుడే తొలిరోజు ఆటకు టికెట్లన్నీ హాట్‌ కేకుల్లా అమ్ముడయ్యాయి.

    aus vs ind

    Also Read : https://rtvlive.com/sports/ind-vs-aus-high-demand-for-boxing-day-test-tickets-opening-day-sold-out-8425150



  • Dec 10, 2024 15:49 IST

    మోసపోకండి.. విద్యార్థులను హెచ్చరించిన UGC

    దూరవిద్య, ఆన్‌లైన్ ప్రొగ్రామ్స్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ఫైక్ నోటీసులు వైరల్ అవుతున్నాయని UGC పేర్కొంది. విద్యార్థులను అవి తప్పుదారి పట్టిస్తున్నాయని UGC విద్యార్థులను హెచ్చరించింది. అధికారిక వెబ్ సైట్ లో వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే నమ్మాలని సూచించింది.

    WhatsApp Image 2024-12-10 at 3.35.40 PM

    Also Read : https://rtvlive.com/job-notifications/institutions-against-fake-and-misleading-notices-ugc-warns-students-8425136



  • Dec 10, 2024 15:38 IST

    వేములవాడలో రాజన్న కోడెల కుంభకోణం.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు!

    వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో భారీ కుంభకోణం బయటపడింది. రాజన్న కోడెలను కబేళాలకు అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసుల నిఘాలో వెలుగులోకి వచ్చింది. ఆలయ అధికారులు 49 కోడెలను అమ్ముకున్నారని విశ్వ హిందూ పరిషత్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

    rerrere

    Also Read : https://rtvlive.com/telangana/vemulawada-sri-rajarajeswara-swamy-temple-huge-cattle-scam-telugu-news-8425099



  • Dec 10, 2024 15:33 IST

    రాజ్యసభ ఛైర్మన్ జగదీశ్‌ ధన్‌కర్‌పై అవిశ్వాస తీర్మానం..!

    రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్‌ ధన్‌ఖర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ఇండియా కూటమి ఆలోచిస్తోంది. కూటమి పార్టీలు ఇందుకోసం చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అవిశ్వాస తీర్మానం బిల్లు పాస్ అవ్వడానికి రాజ్యసభలో ఇండియా బ్లాక్‌కు రాజ్యసభలో తగిన సంఖ్యాబలం లేదు.

    rajyasabha

    Also Read : https://rtvlive.com/national/no-confidence-motion-against-rajya-sabha-chairman-jagdish-dhankar-8423119



  • Dec 10, 2024 15:02 IST

    నాగబాబుకు మంత్రి పదవి.. కేటాయించే శాఖ ఇదే, మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!

    నాగబాబును ఏపీ మంత్రి వర్గంలోకి తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు రీసెంట్‌గా ప్రకటించారు. అయితే ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం జనసేన వద్ద ఉన్న సినిమాటోగ్రఫీ శాఖను నాగబాబుకు కేటాయించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

    Naga Babu : న్యూటన్‌ నియమాలతో చంద్రబాబుకు ఇచ్చిపడేసిన నాగబాబు!

    Also Read : https://rtvlive.com/andhra-pradesh/nagababu-joins-andhra-pradesh-cabinet-which-ministry-will-he-get-8417246



  • Dec 10, 2024 13:46 IST

    ఏపీ కూటమిలో యనమల చిచ్చు.. చంద్రబాబునే బ్లాక్ మెయిల్ చేస్తూ..!

    ఏపీ కూటమి ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సంచలన ఆరోపణలు చేశారు. అగ్రకులాలకు చెందిన పలువురు వ్యక్తులు కాకినాడ సెజ్, ఇతర పరిశ్రమల పేర్లతో బీసీల భూముల లాక్కున్నారంటూ సంచలన లేఖ విడుదల చేశారు.

    yanamula

    https://rtvlive.com/andhra-pradesh/yanamala-ramakrishnudu-sensational-letter-against-tdp-telugu-news-8416528



  • Dec 10, 2024 13:40 IST

    రేవంత్ తెలంగాణ ఉద్యమద్రోహి: ఎర్రబెల్లి దయాకర్

    TG: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ ద్రోహి అని ఫైరయ్యారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సోనియా గాంధీని బలిదేవత అన్న రేవంత్.. ఇప్పుడు జన్మదిన వేడుకలు చేయడం సిగ్గుచేటన్నారు. ఎమర్జెన్సీ పరిస్థిని తలిపించేలా రేవంత్ పాలన ఉందన్నారు.

    Errabelli-Dayakar-Rao-jpg

    https://rtvlive.com/telangana/brs-ex-minister-errabelli-dayakar-rao-slams-cm-revanth-reddy-8416455



  • Dec 10, 2024 13:15 IST

    అధ్యాత్మిక ముసుగులో 20 మందిని భార్యలుగా.. మతనాయకుడికి 50 ఏళ్లు..

    మత నాయకుడి పేరుతో శామ్యూల్ బాటెమ్యాన్ 20 మంది మైనర్ బాలికలపై లైంగిక నేరాలకు పాల్పడ్డాడు. అక్రమంగా బాలికలను తరలించి ఇలా చేయడంతో.. అమెరికా కోర్టు 50 ఏళ్లు జైలు శిక్ష విధించింది. అలాగే ఒక్కో బాధితురాలికి ఒక మిలియన్ డాలర్ల నష్ట పరిహారం ఇవ్వాలని ప్రకటించింది.

    Samuel Bateman

    https://rtvlive.com/international/samuel-bateman-religious-leader-commits-sexual-crimes-by-declaring-20-minors-as-wives-8416393



  • Dec 10, 2024 12:45 IST

    AP Crime: పంట కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి

    ఏపీలో విషాద కర ఘటన చోటుచేసుకుంది. అదుపుతప్పి కారు పంట కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా మరొకరు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన అంబేద్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం మండలం ఊడిమూడి చింతావారిపేటలో కలకలం రేపింది.

    konaseema

    https://rtvlive.com/andhra-pradesh/three-killed-as-car-fell-into-konaseema-crop-canal-telugu-news-8416265



  • Dec 10, 2024 12:13 IST

    BIG BREAKING: RGVకి బిగ్ రిలీఫ్!

    వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ ను మంజూరు చేసింది.

    rgv01

    https://rtvlive.com/cinema/ap-high-court-gave-big-relief-for-rgv-8416224



  • Dec 10, 2024 11:49 IST

    నా బిడ్డల ముందే కొట్టారు.. మీడియాతో మంచు మనోజ్ ఎమోషనల్

    మంచు ఫ్యామిలీ వివాదం పై మనోజ్ మొదటి సారి మీడియా ముందు స్పందించారు. తాను డబ్బు కోసమో ఆస్తి కోసమో ఈ పోరాటం చేయడం లేదని తెలిపారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని.. న్యాయం కోసం అందరినీ కలుస్తానని చెప్పారు. తన బిడ్డలు ఇంట్లో ఉండగా ఇలా చేయడం సరికాదని వాపోయారు.

    manchu Manoj 2

    https://rtvlive.com/cinema/manchu-family-dispute-mohan-babu-vs-manchu-manoj-telugu-news-8416135



  • Dec 10, 2024 11:40 IST

    జగన్ నివాసంలో వాస్తు మార్పులు.. అసలేమైంది?

    AP: మాజీ సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్‌లోవాస్తు మార్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే దక్షిణ దిశలో కంచెను తొలిగించగా.. తాజాగా ఈశాన్యంలో మార్పులు చేస్తున్నారు. కాగా వాస్తు దోషం వల్లే జగన్ ఓటమి చెందారనే చర్చ పార్టీ వర్గాల్లో జోరందుకుంది.

    JAGAN RESIDENCE

    https://rtvlive.com/andhra-pradesh/vasthu-changes-at-ex-cm-jagan-residence-know-the-reason-why-8416100



  • Dec 10, 2024 11:32 IST

    ఏపీలో 483 మెట్రిక్ టన్నుల బియ్యం పట్టివేత!

    విశాఖ పోర్టులో అక్రమంగా ఎగుమతి చేస్తున్న 483 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ నిన్న విశాఖ పోర్టులో ఆకస్మికంగా తనిఖీలు చేపట్టడంతో ఈ విషయం బయటపడింది.

    manohar

    https://rtvlive.com/andhra-pradesh/ap-state-civil-supplies-minister-nadendla-manohar-seized-483-metric-tonnes-of-ration-rice-being-transported-illegally-at-visakhapatnam-port-8416074



  • Dec 10, 2024 11:01 IST

    BREAKING: పోలీసులకు షాక్ ఇచ్చిన మోహన్ బాబు!

    మంచు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తన ఇంటికి వచ్చిన పోలీసులకు మోహన్ బాబు షాక్ ఇచ్చారు. విచారణకు నో చెప్పి.. తమ ఇంటి సమస్య తామే పరిష్కరించుకుంటామని పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు వెనుదిరిగినట్లు సమాచారం.

    Mohan Babu

    https://rtvlive.com/cinema/actor-mohan-babu-said-no-police-investigation-8415992



  • Dec 10, 2024 10:38 IST

    ఏపీ మహిళలకు గుడ్ న్యూస్.. ఫ్రీ బస్సుకు డేట్ ఫిక్స్

    ఏపీ మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యాన్ని సంక్రాంతి నుంచి ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. బస్సులు కొరత, ఆటో డ్రైవర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విధానాలను రూపొందిస్తామని యార్లగడ్డ వెల్లడించారు.

    free bus

    https://rtvlive.com/andhra-pradesh/andhra-pradesh-free-bus-scheme-to-start-from-sankranti-festival-says-mla-yarlagadda-venkata-rao-8415932



  • Dec 10, 2024 09:39 IST

    బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మరో షాక్

    TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మరో ఊహించని షాక్ తగిలింది. ఆయనపై సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందింది. ఏసీపీపై దుర్భాషలాడిన కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ నేత దర్పల్లి రాజశేఖర్ రెడ్డి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.

    PADI KOUSHIK REDDY

    https://rtvlive.com/telangana/shock-for-brs-mla-koushik-reddy-complaint-lodged-8415752



  • Dec 10, 2024 09:19 IST

    BREAKING: మంచు మనోజ్, మౌనికపై కేసు నమోదు

    హీరో మంచు మనోజ్‌కు షాక్ తగిలింది. మనోజ్‌తో పాటు భార్య మౌనికపై కేసు నమోదైంది. తనకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

    manchu Manoj

    https://rtvlive.com/cinema/case-registered-on-manchu-manoj-and-his-wife-8415733



  • Dec 10, 2024 09:03 IST

    ట్రంప్ పాలకవర్గంలో మరో భారత సంతతికి చోటు

    భారత సంతతికి చెందిన హర్మీత్ కె. ధిల్లాన్‌ను పౌర హక్కుల సహాయ అటార్నీ జనరల్‌గా నామినేట్ చేస్తున్నట్లు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చండీగఢ్‌కు చెందిన ఈమె చిన్నతనంలోనే ఫ్యామిలీ అమెరికలో స్థిర పడ్డారు.

    Harmeet K. Dhillon

    https://rtvlive.com/international/donald-trump-nominated-to-harmeet-k-dhillon-assistant-attorney-general-for-civil-rights-8415697



  • Dec 10, 2024 08:46 IST

    మోహన్ బాబుపై మంచు మనోజ్ సంచలన ఆరోపణలు

    మోహన్ బాబు, విష్ణుపై మంచు మనోజ్ ఆరోపణలు చేశాడు. MBUలో విష్ణు, అతని సహచరుడు వినయ్ కలిసి దోపిడీలు చేయడం ద్వారా అక్కడ చదువుతున్న విద్యార్థులు ఇబ్బందులు గురవుతున్నారని, వారికి అండగా నిలిచినందుకు తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పారు.

    MANOJ M

    https://rtvlive.com/cinema/hero-manchu-manoj-makes-allegations-on-mohan-babu-8415669



  • Dec 10, 2024 08:13 IST

    బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

    ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల ఏపీలో పలు జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురవనున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్ధ తెలిపింది. కోత కోసిన రైతులు పంట వ్యర్థం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.

    rains

    https://rtvlive.com/weather/andhra-pradesh-state-in-heavy-rains-due-to-low-pressure-in-bay-of-bengal-8415655



  • Dec 10, 2024 08:01 IST

    అలా చేస్తే కఠిన చర్యలు.. రాష్ట్ర సర్కార్ హెచ్చరిక!

    TG: తెలంగాణ తల్లి విగ్రహంపై రేవంత్ సర్కార్ కీలక ప్రకటన చేసింది. తెలంగాణ తల్లి చిత్రాన్ని, రూపాన్ని వక్రీకరించడం, వేరేవిధంగా చూపించడాన్ని నిషేధించింది. ఒకవేళ ఎవరైనా అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

    Telangana thalli

    https://rtvlive.com/telangana/telangana-government-bans-making-false-posts-against-telangana-thalli-statue-8415645



  • Dec 10, 2024 07:32 IST

    Road Accident: ముంబైలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

    ముంబైలోని కుర్లా ప్రాంతంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా ఓ బస్సు జనాలపైకి దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా.. మరో 20 మందికిపైగా గాయాలయ్యాయి. బస్సు బ్రేక్‌ ఫెయిల్‌ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.

    Road Accident..

    https://rtvlive.com/national/road-accident-in-mumbai-five-people-died-8415637



  • Dec 10, 2024 07:19 IST

    బట్టలు ఆరేస్తుండగా.. విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి

    బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్ కొట్టి ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించిన విషాద ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది. కొడుకు బట్టలు ఆరేస్తుండగా షాక్ కొట్టడంతో తల్లి కాపాడటానికి ప్రయత్నించింది. ఈక్రమంలోనే ఆమెతో పాటు కొడుకు, కూతురు మరణించారు.

    Current shock

    https://rtvlive.com/crime/alluri-seetharamaraju-district-three-persons-are-dead-due-to-electric-shock-8415634



  • Dec 10, 2024 06:52 IST

    బంకర్ లో విలువైన వస్తువులు..సిరియా అధ్యక్షుడి ప్రైవేట్ బంకర్ చూశారా?

    సిరియాలో నిరంకుశపాలనకు ముగింపు పలికారు. అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయాడు. దీని తర్వాత ఆయన ఇంటిని సిరియా ప్రజలు కొల్లగొట్టారు. ఇందులో అత్యంత విలువైన వస్తువులను ఎత్తుకెళ్ళిపోయారు. ఈ క్రమంలో అసద్ ఇంటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

    00

    https://rtvlive.com/international/inside-assads-hidden-family-bunker-in-syria-footage-gone-viral-8415539



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు