RGV: కేసులతో ఇరుకున పడ్డ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. ఇటీవల సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ల మార్ఫ్‌డ్ ఫోటోలను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసి తమ మనోభావాలు దెబ్బ తీశారని టీడీపీ నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆర్జీవీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసుల్లో పోలీసులు తనను అరెస్ట్ చేయకుండా ఉండేందుకు హైకోర్టును ఆశ్రయించారు ఆర్జీవీ.
Also Read: చీటింగ్ కేసులో ప్రముఖ నటుడికి ఢిల్లీ కోర్టు నోటీసులు!
ఈ కేసులలో ముందస్తు బెయిల్ కోరుతూ బెయిల్ పిటిషన్ వేశారు. పలు మార్లు ఈ కేసుపై విచారించి.. వాయిదాలు వేసిన ధర్మాసనం నేడు తుది తీర్పు వెలువరించింది. అర్జీవీకి షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. మొతం మూడు కేసుల్లో షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని రాంగోపాల్‌వర్మకు హైకోర్టు ఆదేశించింది. పోలీసులు కోరినప్పుడు విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే బెయిల్ రద్దు అవుతుందని పేర్కొంది.
అసలేమైంది...
గతంలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ లపై అసభ్యకర పోస్టులు పెట్టారని.. అలాగే 'వ్యూహం' మూవీ ప్రమోషన్ సమయంలో వారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో టీడీపీ నేత మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగం ఆర్జీవీపై కేసు పెట్టారు. ఆయన ఫిర్యాదుతో ప్రకాశం జిల్లా మద్ది పాడు పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆర్జీవికి నోటీసులిచ్చారు. తనపై నమోదు అయిన కేసును కొట్టేయాలని ఆర్జీవి హైకోర్టులో పిటిషన్ వేశారు. అయితే పలుమార్లు ఈ కేసు పై విచారణ వాయిదా పడగా.. తాజాగా కోర్టు ఇచ్చిన తీర్పుతో ఆర్జీవీకి భారీ ఊరట లభించింది.
Also Read: 46 ఏళ్ళ వయసులో కోయాక్టర్ ను పెళ్లి చేసుకున్న హీరో.. ఫొటోలు వైరల్!
Also Read: RGVకి బిగ్ రిలీఫ్!