AP News: ఏపీ కూటమి ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు సంచలన ఆరోపణలు చేశారు. అగ్రకులాలకు చెందిన పలువురు వ్యక్తులు కాకినాడ సెజ్, ఇతర పరిశ్రమల పేర్లతో బీసీల భూముల లాక్కున్నారంటూ సంచలన లేఖ విడుదల చేశారు. బీజీల భూములతోనే కోట్లకు పడగలెత్తిన వారు బీసీలను ఎదగకుండా తొక్కేశారంటూ తనదైన స్టైల్ విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని వారి భూములు వారికి ఇప్పించాలని లేఖలో పేర్కొన్నారు. అంతేకాదు ఈ లేఖలో కొంతమంది కులాల పేర్లను ప్రస్తావించడం చంద్రబాబు సర్కారులో ప్రకంపనలు రేపుతోంది. మరోవైపు కుట్రపూరితంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవకాశం దక్కలేదనే అక్కసుతో.. అయితే ఈ లేఖ రాసి మూడు రోజులు గడిచినా జోరుగా చర్చ నడుస్తోంది. టీడీపీ నేతలంగా యనమల లేఖపై మండిపడుతున్నారు. బీసీ కోటాలో యనమల కుటుంబం పెద్ద ఎత్తున పదవులు పొందిందని, తుని నుంచి ఈ సారి సోదరుడు కృష్ణుడుకి కాకుండా తన కూతురుకు సీటు ఇప్పించుకున్నప్పటికీ ఇలాంటి ఆరోపణలు చేయడం ఏమిటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆయన అల్లుడు మహేష్ ఏలూరు ఎంపీగా గెలిచారు. ఆయన వియ్యంకుడు కడప జిల్లా మైదుకూరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. యనమల స్వయంగా ఎమ్మెల్సీగా ఉన్నారు. అయినా ఆయనకు అవకాశం దక్కలేదనే అక్కసుతో ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇది కూడా చదవండి: రేవంత్ తెలంగాణ ఉద్యమద్రోహి: ఎర్రబెల్లి దయాకర్ అంతేకాదు యనమల రాజ్యసభ సీటు లేదా మంత్రి పదవి ఆశించి ఇలా రాజకీయం చేస్తున్నారంటున్నారు. ఇది చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేసే ప్రయత్నమంటూ మండిపడుతున్నారు. ఈ ఒక్క లేఖతో ఆయన పరపతి మొత్తం పోగొట్టుకుంటున్నారని, ఈ లేఖ ఉద్దేశం ఏమిటో, అలా ఎందుకు రాయాల్సి వచ్చిందో క్లారిటీ ఇవ్వకపోతే అతనికే నష్టం అంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ]ఇది కూడా చదవండి: రేవంత్ తెలంగాణ ఉద్యమద్రోహి: ఎర్రబెల్లి దయాకర్ Also Read: TG News: తెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం..స్కూళ్లలో ఆ ఫొటోలు తప్పనిసరి