మోహన్ బాబుపై మంచు మనోజ్ సంచలన ఆరోపణలు

మోహన్ బాబు, విష్ణుపై మంచు మనోజ్ ఆరోపణలు చేశాడు. MBUలో విష్ణు, అతని సహచరుడు వినయ్ కలిసి దోపిడీలు చేయడం ద్వారా అక్కడ చదువుతున్న విద్యార్థులు ఇబ్బందులు గురవుతున్నారని, వారికి అండగా నిలిచినందుకు తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని చెప్పారు.

New Update
MANOJ M

Manchu Manoj: మోహన్ బాబుపై సంచలన ఆరోపణలు చేశారు నటుడు మంచు మనోజ్. తనపై మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మీద మనోజ్ స్పందించారు. తనకు రక్షణగా నిలవాలని ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డిని కోరారు. కొన్నాళ్ల నుంచి ఇంటికి, మా కుటుంబం దూరంగానే ఉంటున్నామని అన్నారు. తన ముందే తన కుటుంబసభ్యుల్ని తీవ్రంగా తిట్టారని ఆరోపించారు. ఇంటిలోని సిసి ఫుటేజీ, కెమెరాలు మాయమయ్యాయని అన్నారు. విష్ణు అనుచరులే సిసి ఫుటేజ్ మొత్తాన్ని మాయం చేశారని చెప్పారు

ఇది కూడా చూడండి: అలా చేస్తే కఠిన చర్యలు.. రాష్ట్ర సర్కార్ హెచ్చరిక!

ఆస్తుల కోసం కాదు..

తాను ఆస్తుల కోసం ఎప్పుడూ ప్రాకులా లేదని క్లారిటీ ఇచ్చారు మంచు మనోజ్. తాను, తన భార్య సొంత కాళ్ల మీద నిలబడుతున్నాం అని చెప్పారు. మోహన్ బాబు విద్యాసంస్థల్లో అక్రమాలు జరుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. విద్యాసంస్థలోని బాధితులకు తాను అండగా ఉన్నా అని అన్నారు. బాధితుల పక్షాన నిలబడ్డందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేశారని చెప్పారు.  విష్ణు, అతని సహచరుడు వినయ్ మహేశ్వర్ ద్వారా దోపిడీకి మోహన్ బాబు యూనివర్సిటీ  విద్యార్థులు గురవుతున్నారని అన్నారు. వారి ఆర్థిక అవకతవకలు, దోపిడీకి సంబంధించి తన వద్ద చాలా ఆధారాలు ఉన్నాయని చెప్పారు. తాను పైన చెప్పిన వాటిని అధికారులకు అందించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కాగా మంచు ఫ్యామిలీలో విభేదాలు భగ్గుమనడం తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు అటు రాజకీయాల్లోనూ చర్చనీయాంశమైంది. కొడుకు మంచు మనోజ్ ప మోహన్ బాబు.. తండ్రి మోహన్ బాబు పై కొడుకు మంచు మనోజ్ ఒకరి పై ఒకరు ఆరోపణలు చేస్తూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి.. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. మరి మంచు ఫ్యామిలీలో చెలరేగిన మంట ఎప్పుడు చల్లారుతుందో వేచి చూడాలి.

ఇది కూడా చూడండి:  బట్టలు ఆరేస్తుండగా.. విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి

ఇది కూడా చూడండి: SM Krishna: కర్ణాటక మాజీ సీఎం కన్నుమూత

ఇది కూడా చూడండి: Road Accident: ముంబైలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు