రేవంత్ తెలంగాణ ఉద్యమద్రోహి: ఎర్రబెల్లి దయాకర్

TG: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమ ద్రోహి అని ఫైరయ్యారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సోనియా గాంధీని బలిదేవత అన్న రేవంత్.. ఇప్పుడు జన్మదిన వేడుకలు చేయడం సిగ్గుచేటన్నారు. ఎమర్జెన్సీ పరిస్థిని తలిపించేలా రేవంత్ పాలన ఉందన్నారు.

New Update
TS Politics: ఆ పనులు రేవంత్ కు అలవాటే.. పోలీస్ స్టేషన్ లో కూర్చుంటా: ఎర్రబెల్లి వార్నింగ్

BRS Party: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తల్లి విగ్రహ రాజకీయానికి నిరసనగా ఈరోజు భారత రాష్ట్ర సమితి పిలుపు మేరకు శాంతియుత నిరసన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. తెలంగాణ తల్లి పేరు చెప్పి కాంగ్రెస్ తల్లి పేరుతో ఈ ప్రభుత్వం చేసిన అపచారానికి నిరసనగా ఈరోజు దేవరుప్పుల మండలం సీతారాంపురం గ్రామంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా ఉద్యమకారులను సన్మానించారు వారిలో ఆవుల వీరన్న, బస్వా రమేష్, బాశిపాక కొండయ్య ఉన్నారు.

Also Read: 'పుష్ప2' జేసీబీ కంటే తోపేమి కాదు.. బన్నీ గాలి తీసేసిన సిద్దార్థ్!

 ఉద్యమ ద్రోహి రేవంత్...

సీఎం రేవంత్  రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి ఎర్రబెల్లి. తెలంగాణ ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి అని ఫైరయ్యారు. తన మోసపూరిత హామీలతో అధికారం లోకి వచ్చాక కూడా తన ప్రవర్తన మారటం లేదని అన్నారు. నాడు సోనియా గాంధీని బలి దేవత అని నేడు సోనియాగాంధీ పుట్టినరోజు  వేడుకలు చేయడానికి సిగ్గు అనిపిస్తలేదా?, ఒకపక్క ఆశా వర్కర్లను పోలీసులతో అరెస్టులు చేస్తూ లాఠీచార్జీలు చేస్తూ, తెలంగాణ తల్లి విగ్రహం లోని బతుకమ్మను తొలగించి యావత్ తెలంగాణ మహిళల మనోభావాలను దెబ్బతీస్తూ, మహిళాభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం మా ప్రభుత్వం అనడానికి నీకు నోరేలా వచ్చింది? అని నిలదీశారు.

ఇది కూడా చదవండి: 'పుష్ప2' కు బలైన మరో ప్రాణం.. థియేటర్ లో అనుమానాస్పద మృతి

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు తెలుసుకో వాటిని మార్చి చరిత్ర ని మార్చాలనుకోవటం ని మూర్ఖత్వం అని నిప్పులు చెరిగారు. ఆనాడు ఇందిరా  గాంధీ ఎమర్జెన్సీ పెట్టి దేశాన్ని ఎలా పాలించిందో, నేడు రేవంత్ పాలన అదే తీరు తలపిస్తుందని అన్నారు. 'నీకు ఏ మాత్రం చిత్త శుద్ధి ఉన్న ని ప్రవర్తన మార్చుకో ప్రజలను ఇబ్బందులకు గురిచేయకు" అని సీఎం రేవంత్‌ను  కోరారు.

Also Read: ఏపీ కూటమిలో యనమల చిచ్చు.. చంద్రబాబునే బ్లాక్ మెయిల్ చేస్తూ..!

Also Read: ఉర్ఫీ ఫ్యాషన్ చూస్తే అవాక్కవ్వాల్సిందే.. ఫొటోల పై సమంత కామెంట్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు