బంకర్ లో విలువైన వస్తువులు..సిరియా అధ్యక్షుడి ప్రైవేట్ బంకర్ చూశారా?

సిరియాలో నిరంకుశపాలనకు ముగింపు పలికారు. అధ్యక్షుడు దేశం విడిచి పారిపోయాడు. దీని తర్వాత ఆయన ఇంటిని సిరియా ప్రజలు కొల్లగొట్టారు. ఇందులో అత్యంత విలువైన వస్తువులను ఎత్తుకెళ్ళిపోయారు. ఈ క్రమంలో అసద్ ఇంటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

New Update
00

తిరుగుబాటు దళాలు సిరియా రాజధాని డమాస్కస్‌ను ఆక్రమించుకోవడంతో అధ్యక్షుడు బషర్‌ అల్‌ అసద్‌ దేశాన్ని విడిచి వెళ్లిన సంగతి తెలిసిందే. అసద్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి రష్యాకు చేరినట్లు అక్కడి మీడియా వర్గాలు ప్రకటించాయి. అసద్‌కు రష్యా ఆశ్రయం కల్పించినట్లు సదరు వర్గాలు తెలిపాయి.  సిరియా అధ్యక్షుడు అసద్‌ తన కుటుంబంతో సహా మాస్కోకు చేరుకున్నారు. మానవతా సాయం కోణంలో రష్యా ఆయనకు ఆశ్రయం కల్పించినట్లు  కొన్ని విశ్వసనీయ వర్గాలు మీడియాకు సమాచారమిచ్చాయి.  ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు నిర్ణయించుకున్నారని , అధికారాన్ని శాంతియుతంగా బదిలీ చేయడానికి తగు సూచనలు ఇచ్చారని రష్యా విదేశాంగ శాఖ వెల్లడించింది.

అణిచివేతకు స్వస్తి..

ఈ నేపథ్యంలో డమాస్కస్‌లోని అసద్ ఇంట్లోకి ప్రజలు చొరబడ్డారు. విలాసవంతమైన ఆయన నివాసంలోని ప్లేట్లు, ఫర్నిచర్‌.. ఇలా చేతికి దొరికిన వస్తువులను ఎత్తుకెళ్ళారు. దీంతో అధ్యక్షుడి ఇంటి వీడియోలు కొన్నిబయటకు వచ్చాయి.  సిరిమా మాజీ అధ్యక్షుడు అసద్‌కు ఓ ఫ్యామిలీ బంకర్ కూడా ఉంది. ఇప్పుడు దీని వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇది అసద్ ఇంట్లోనే ఉంటుంది.  ఇంట్లోని పలు తలుపులు తెరిచిన తర్వాత ఓ సొరంగ మార్గం బయటపడిందని.. అందులో వారికి సంబంధించిన బంగారు ఆభరణాలు, ఆయుధాల నిల్వలు భారీగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. వీడియోలో అధ్యక్షుడి నివాసం లోపల భారీ సొరంగం, దాని చివర్లో చెల్లాచెదురుగా పడి ఉన్న పెట్టెలు, ఇతర వస్తువులు, విశాలమైన గదులు కనిపించాయి.  

ఇక మర వీడియోలో అధ్యక్షుడు అసద్‌కు సంబంధించిన ప్రవైట్ గ్యారే దృశ్యాలు ఉన్నాయి. ఇందులో కోట్ల రూపాయలు విలువైన పోర్ష్‌, లంబోర్గిని, ఫెరారీ, మెర్సిడెజ్‌- బెంజ్‌, ఆడీ వంటి పలు లగ్జరీ కార్లు ఉన్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. మరోవైపు కొందరు తిరుగుబాటుదారులు వివిధ బ్యాంకులపై దాడి చేసి, నగదు పెట్టెలతో పారిపోయినట్లు మీడియా వర్గాలు చెప్పాయి. అసద్‌ పారిపోయిన తర్వాత నిరంకుశ పాలన నుంచి సిరియాకు విముక్తి లభించిందని ప్రజలు, తిరుగుబాటుదారులు సంబరాలు చేసుకున్నారు. వీరి కుటుంబం 50 ఏళ్ళ నుంచి సిరియాను పాలిస్తుందని.. అన్నేళ్ళుగా అణిచివేత,  13 సంవత్సరాల దౌర్జన్యం వల్ల ఎందరో సిరియన్లు ఇతర దేశాలకు వెళ్లిపోయారని.. ఈ రోజుతో తాము ఈ చీకటి కాలానికి ముగింపు పలుకుతున్నామని తెలిపారు. సిరియాలో కొత్త శకం ప్రారంభమైందని ప్రకటించారు. 

Also Read: HYD: హైదరాబాద్ ట్రాఫిక్ కోసం హెచ్‌‌– సిటీ

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు