BREAKING: మంచు మనోజ్, మౌనికపై కేసు నమోదు

హీరో మంచు మనోజ్‌కు షాక్ తగిలింది. మనోజ్‌తో పాటు భార్య మౌనికపై కేసు నమోదైంది. తనకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

New Update
MANCHU MANOJ

Manchu Manoj: హీరో మంచు మనోజ్ కు షాక్ తగిలింది. మనోజ్, భార్య మౌనికపై కేసు నమోదు అయింది. తనకు ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అంతకు ముందు మనోజ్ ఇచ్చిన ఫిర్యాదుపై మోహన్ బాబుకు చెందిన 10 మంది అనుచరులపై 329, 351, 115 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు ఫిర్యాదుపై ఇప్పటికే 'ఎక్స్' వేదికగా మంచు మనోజ్ స్పందించారు.

ఇది కూడా చూడండి:  బట్టలు ఆరేస్తుండగా.. విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి

ఆస్తుల కోసం కాదు..

తాను ఆస్తుల కోసం ఎప్పుడూ ప్రాకులా లేదని క్లారిటీ ఇచ్చారు మంచు మనోజ్. తాను, తన భార్య సొంత కాళ్ల మీద నిలబడుతున్నాం అని చెప్పారు. మోహన్ బాబు విద్యాసంస్థల్లో అక్రమాలు జరుగుతున్నాయని సంచలన ఆరోపణలు చేశారు. విద్యాసంస్థలోని బాధితులకు తాను అండగా ఉన్నా అని అన్నారు. బాధితుల పక్షాన నిలబడ్డందుకే తనపై తప్పుడు ఆరోపణలు చేశారని చెప్పారు.  విష్ణు, అతని సహచరుడు వినయ్ మహేశ్వర్ ద్వారా దోపిడీకి మోహన్ బాబు యూనివర్సిటీ  విద్యార్థులు గురవుతున్నారని అన్నారు.

ఇది కూడా చూడండి: ముంబైలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

వారి ఆర్థిక అవకతవకలు, దోపిడీకి సంబంధించి తన వద్ద చాలా ఆధారాలు ఉన్నాయని చెప్పారు. తాను పైన చెప్పిన వాటిని అధికారులకు అందించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కాగా మంచు ఫ్యామిలీలో విభేదాలు భగ్గుమనడం తెలుగు సినీ ఇండస్ట్రీతో పాటు అటు రాజకీయాల్లోనూ చర్చనీయాంశమైంది. కొడుకు మంచు మనోజ్ ప మోహన్ బాబు.. తండ్రి మోహన్ బాబు పై కొడుకు మంచు మనోజ్ ఒకరి పై ఒకరు ఆరోపణలు చేస్తూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కి.. ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. మరి మంచు ఫ్యామిలీలో చెలరేగిన మంట ఎప్పుడు చల్లారుతుందో వేచి చూడాలి.

ఇది కూడా చూడండి: అలా చేస్తే కఠిన చర్యలు.. రాష్ట్ర సర్కార్ హెచ్చరిక!

ఇది కూడా చూడండి: SM Krishna: కర్ణాటక మాజీ సీఎం కన్నుమూత

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు