Ex CM Jagan: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్‌లో వాస్తు మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే దక్షిణ దిశలో కంచెను ఆయన సిబ్బంది తొలిగించారు. తాజాగా ఈశాన్యంలో మార్పులు చేస్తున్నారు. కలిసి రాని కాలానికి వాస్తు దోషాలే కారణమని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. తూర్పు ఈశాన్యం మూసి ఉంచడం మంచిది కాదని వాస్తు పండితులు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. జగన్ ఇంటికి వాస్తు మార్పులు చేయడంతో రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. వాస్తు దోషం వల్లే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చెందినట్లు పార్టీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఇది కూడా చూడండి: బట్టలు ఆరేస్తుండగా.. విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి త్వరలో జనంలోకి జగన్... చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మరోసారి ప్రజల్లోకి రానున్నారు. కొత్త ఏడాది.. కొత్త జోష్ తో జనంలోకి వెళ్లనున్నారు. జనవరి 3వ వారం నుంచి జిల్లాల పర్యటనలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గంలో 2 రోజులపాటు సమీక్షలు చేయనున్నట్లు సమాచారం. మొత్తం 26 జిల్లాల్లో పర్యటనలు చేసేందుకు జగన్ రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారట.అయితే దీనిపై మరికొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇది కూడా చూడండి: ముంబైలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అడుగుజాడల్లో.. ఇప్పటికే ఎన్నికల ఓటమి ఎఫెక్ట్, నేతల ఫిరాయింపులు, అరెస్టులు, కేసులతో వైసీపీ క్యాడర్ బలహీనంగా మారింది. అయితే.. పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు, పార్టీ బలోపేతం, కార్యకర్తలలో ఉత్సహాన్ని తెచ్చేందుకు వరుస సమావేశాలు నిర్వహించనున్నారు జగన్. పార్టీ బలోపేతంపై వారి నుంచి సలహాలు, సూచనలు తీసుకోనున్నారు. ఇకపై అపాయింట్మెంట్ లేకున్నా తాడేపల్లిలోనూ ప్రతీ ఒక్కరినీ కలిసేలా ప్లానింగ్ చేయనున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలో జనంతో మమేకమయ్యేలా స్కెచ్ వేశారు. నియోజకవర్గ నేతలు ప్రత్యేకంగా కలిసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది కూడా చూడండి: బట్టలు ఆరేస్తుండగా.. విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి ఇది కూడా చూడండి: పోలీసులకు షాక్ ఇచ్చిన మోహన్ బాబు!