Vemulawada : వేములవాడలోని ప్రముఖ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో భారీ కుంభకోణం బయటపడింది. రాజన్న కోడెలను కబేళాలకు అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసుల నిఘాలో వెలుగులోకి వచ్చింది. వందల సంఖ్యలో మూగజీవాలను కోతకు తరలించినట్లు నిర్ధారించిన పోలీసులు.. ఆగస్టు 12న కోడెలను తరలిస్తున్న రాంబాబు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో ఈ అవినీతిలో ఆలయ ఈవో వినోద్ రెడ్డి హస్తం కూడా ఉన్నట్లు బయటపడింది. కాంగ్రెస్ మంత్రి మెప్పు కోసం నిబంధనలకు విరుద్ధంగా కోడెలను పక్కదారి పట్టించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇది కూడా చూడండి: ముంబైలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం 60 కోడెల్లో ప్రస్తుతం 11 మాత్రమే.. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సిఫారసుతో తెచ్చిన 60 కోడెల్లో ప్రస్తుతం 11 మాత్రమే ఉండటం పలు అనుమానాలకు దారితీసింది. గోశాల నిర్వాహకుడు వీటి రాజన్న కోడెల గురించి పొంతన లేని సమాధానాలు చెప్పడంతో గోశాల ముసుగులో గోవులను కబేళాలకు తరలిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. గీసుకొండ మండలం మనుగొండకు చెందిన మాదాసి రాంబాబుకు వేములవాడ రాజన్న ఆలయానికి చెందిన 60 కోడెలను ఇచ్చారు. కానీ.. అతను చెప్పిన గోశాలలో ప్రస్తుతం 11 మాత్రమే ఉన్నాయి. మిగతా గోవులను విక్రయించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కూడా చూడండి: బట్టలు ఆరేస్తుండగా.. విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి సంరక్షణ పేరిట వీరు కబేళాలకు.. గీసుకొండ మండలం గట్టు కిందిపల్లెలో డీబీఏం-38 సబ్ కెనాల్ పక్కన గోశాలలోని 49 కోడెలను అమ్ముకున్నారని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం అనంతారం గ్రామంలో.. మంద స్వామి, రాంబాబు కలిసి ఐదేళ్ల కిందట హనుమాన్ గోశాలను నిర్వహించారు. పలు ఆలయాల నుంచి గోవులను తీసుకొచ్చి సంరక్షణ పేరిట వీరు కబేళాలకు విక్రయించినట్టు తెలుస్తోంది. కబేళాలకు అమ్ముతుండగా తాము అడ్డుకుని పోలీసులకు పట్టిచ్చినట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ వ్యవహారం బయటకు రావడంతో హనుమాన్ గోశాలను మూసివేసి మళ్లీ కొత్తగా గట్టుకిందిపల్లెలో గోశాల ఏర్పాటు చేసి దందా కొనసాగిస్తున్నారని మండిపడుతున్నారు. పోలీసుల విచారణలో నిర్వాహకులు మరికొన్ని తీసుకొస్తుండగానే పారిపోయినట్లు వింత సమాధానాలు చెప్పారు. దీంతో 49 కోడెలను అమ్మేసినట్లు బయటపడింది. దీనిపై విచారణ చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. ఇది కూడా చూడండి: అలా చేస్తే కఠిన చర్యలు.. రాష్ట్ర సర్కార్ హెచ్చరిక! ఇది కూడా చూడండి: కర్ణాటక మాజీ సీఎం కన్నుమూత