ఏపీ మహిళలకు గుడ్ న్యూస్.. ఫ్రీ బస్సుకు డేట్ ఫిక్స్

ఏపీ మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యాన్ని సంక్రాంతి నుంచి ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. బస్సులు కొరత, ఆటో డ్రైవర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విధానాలను రూపొందిస్తామని యార్లగడ్డ వెల్లడించారు.

New Update
free bus

మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ తెలిపింది. సంక్రాంతి నుంచి మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించనున్నట్లు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సూపర్ సిక్స్ హామీల్లో ఒకటి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఈ హామీని సంక్రాంతి నుంచి మొదలు పెట్టనున్నారు.

ఇది కూడా చూడండి: SM Krishna: కర్ణాటక మాజీ సీఎం కన్నుమూత

40c40a63-c10d-4ad8-aa7a-aeae9b6f051b

ఆటో డ్రైవర్లను దృష్టిలో ఉంచుకుని..

ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బస్సుల కొరత లేకుండా ఉండేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయనున్నట్లు యార్లగడ్డ వెంకటరావు తెలిపారు. ఫ్రీ బస్సు వల్ల ఆటో డ్రైవర్లకు కూడా ఇబ్బంది కలగకుండా ఫ్రీ బస్సు అమలు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఆటో డ్రైవర్లను దృష్టిలో ఉంచుకుని విధానాలను రూపొందిస్తామని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు తెలిపారు. 

ఇది కూడా చూడండి:  బట్టలు ఆరేస్తుండగా.. విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యాన్నికల్పిస్తామని సూపర్ సిక్స్‌‌లో భాగంగా హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే స్కీమ్‌ను ప్రారంభించడానికి ప్లాన్ చేస్తోంది. అయితే దీపావళి పండుగకే ఫ్రీ బస్ సౌకర్యాన్ని కల్పించాలని భావించింది. కానీ అప్పడు ప్రారంభించలేదు. మిగతా రాష్ట్రాల్లో  ఈ పథకానికి ఎంత ఖర్చు అవుతుంది. 

ఇది కూడా చూడండి: Road Accident: ముంబైలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

ఎలా అమలు చేస్తే ప్రయాణికులు ఇబ్బంది పడరో అన్ని విషయాలను తెలుసుకుని స్కీమ్ అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంటుంది. ఈ స్కీమ్‌పై అన్ని విధానాలను ప్రభుత్వం అధికారులతో చర్చించింది. ఎన్ని కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకురావాలని, రోజుకి ఎంత మంది ప్రయాణిస్తారు, ఏ విధంగా అమలు చేయాలని అన్నింటిపై చర్చించింది. కేవలం ఇంకా ఫ్రీ బస్సు స్కీమ్ అమలు చేయడం మాత్రమే మిగిలి ఉంది. 

ఇది కూడా చూడండి: అలా చేస్తే కఠిన చర్యలు.. రాష్ట్ర సర్కార్ హెచ్చరిక!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు