Telangana Thalli: తెలంగాణ తల్లి విగ్రహాన్ని నిన్న సచివాలయంలో జాతికి అంకితం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కాగా రాష్ట్రంలో ప్రతి సంవత్సరం డిసెంబరు 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం రేవంత్ అసెంబ్లీలో ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. సీఎం ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రోజున రాష్ట్రంలోని అన్ని జిల్లా, మండలాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారిక కార్యక్రమం నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ క్రమంలో తెలంగాణ తల్లి ఫొటోను విడుదల చేసింది.
Also Read: గ్రూప్ –2 ఎగ్జామ్‌ను వాయిదా వేయలేం–హైకోర్టు
కఠిన చర్యలు తప్పవు...
అయితే, తెలంగాణ తల్లి విగ్రహంపై బహిరంగ ప్రదేశాల్లో, ఆన్‌లైన్లో, సామాజిక మాధ్యమాల్లో, మాటలు, చేతలతో అగౌరవపర్చడం, ధ్వంసం చేయడం, కాల్చడం, అవహేళన చేయడం, అవమానించడం, కించపర్చడం నేరంగా పరిగణించబడుతుందని సీఎస్ శాంతికుమారి అన్నారు. తెలంగాణ రాష్ట్ర బహుజనుల పోరాట పటిమను, సాంస్కృతిక, సంప్రదాయ, వ్యవసాయ పద్ధతులను, శ్రమించే జీవనశైలిని, భావితరాలకు స్ఫూర్తిని కలిగించే ఒక చిహ్నంగా తెలంగాణ తల్లి ఉండాలని ప్రభుత్వం ఆలోచించిందని.. వీటన్నిటి ప్రతిబంబించేలాప్రత్యేక చిహ్నాలు కలిగిన విగ్రహాన్ని తెలంగాణ తల్లిగా రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిందని పేర్కొంది. తెలంగాణ తల్లి మన జాతి అస్తిత్వ, ఆత్మగౌరవ ప్రతీక అని ఆమె అన్నారు. కాబట్టి తల్లి చిత్రాన్ని, రూపాన్ని వక్రీకరించడం, వేరేవిధంగా చూపించడం నిషేంధించడం జరిగిందని చెప్పారు. ఎవరైనా ఈ విగ్రహాన్ని అవమానించడం, తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.