రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ నిన్న విశాఖ పోర్టులో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేసేందుకు విశాఖ పోర్టులో 483 టన్నులను రెడీ చేసిన రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోర్టులో కంటైనర్ ఫ్రైట్ స్టేషన్‌లో ఉన్న మొత్తం నాలుగు గోదాముల్లో తనిఖీలు చేపట్టగా.. రేషన్ బియ్యం బయట పడింది. ఇది కూడా చూడండి: SM Krishna: కర్ణాటక మాజీ సీఎం కన్నుమూత రేషన్ బియ్యంలో కెర్నల్స్ ఉండటంతో.. రెండు గోదాముల్లో ఉన్న కంటైనర్లలో రేషన్ బియ్యంలో కెర్నల్స్ ఉన్నట్లు సాంకేతిక సిబ్బంది గుర్తించారు. అక్రమంగా ఎగుమతి చేస్తున్న 483 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. రేషన్ కార్డుదారులకు సరఫరా చేసే ఫోర్టిఫైడ్ రైస్‌లో కెర్నల్స్ ఉంటాయి. వీటిలో కూడా ఉండటంతో వాటిని సీజ్ చేశారు. ఇది కూడా చూడండి: బట్టలు ఆరేస్తుండగా.. విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి విశాఖ పోర్టు నుంచి రేషన్ బియ్యం ఎగుమతి అవుతుందని సమాచారం రావడంతో నాలుగు బృందాలు తనిఖీలు నిర్వహించాయి. కంటైనర్ ఫ్రైట్ స్టేషన్ గోదాముల్లో రెగ్యులర్ బియ్యం, ఇతర సరుకులతో పాటు రేషన్ బియ్యం కూడా ఉన్నట్లు గుర్తించారు. రాయ్‌పూర్‌కు చెందిన ఏజీఎస్ ఫుడ్స్ అనే సంస్థ ఈ బియ్యం ఎగుమతి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాకినాడ పోర్టులో కాస్త స్ట్రిట్ కావడంతో అక్రమ వ్యాపారులు గత రెండు నెలల నుంచి విశాఖ పోర్టు బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నారు. సుమారుగా రూ.25 వేల కోట్ల బియ్యాన్ని అక్రమంగా రవాణా చేశారని రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇది కూడా చూడండి: అలా చేస్తే కఠిన చర్యలు.. రాష్ట్ర సర్కార్ హెచ్చరిక! ప్రభుత్వం కిలో బియ్యం రూ.43కు కొనుగోలు చేసి కార్డుదారులకు ఇస్తుంది. వీరు వారిని మోసం చేసి కిలో రూ.10కు తీసుకుంటున్నారు. ఆ తర్వాత వాటిని పాలిష్ చేసి కిలో రూ.70 నుంచి రూ.80కు విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇలా అక్రమంగా ఎగుమతి చేసి కోట్లు సంపాదిస్తున్నారన్నారు. ఇకపై రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు అధికార యంత్రాంగం, మీడియాతో కలిసి పనిచేస్తామని నాదెండ్ల తెలిపారు. ఇది కూడా చూడండి: Road Accident: ముంబైలో ఘోర ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం