డిస్టెన్స్, ఆన్‌లైన్‌లో హైయిర్ ఎడ్యుకేషన్‌లో కోర్సులను చదువుతున్న విద్యార్థులను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అప్రమత్తం చేసింది. దూరవిద్య విధానం, ఆన్‌లైన్ ప్రొగ్రామ్స్‌కు సంబంధించి సోషల్ మీడియాలో ఫైక్ నోటీసులు వైరల్ అవుతున్నాయని చెప్పింది. అవి విద్యార్థులను పూర్తిగా తప్పుదారి పట్టిస్తున్నాయని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) విద్యార్థులు, విద్యా సంస్థలను హెచ్చరించింది. ఇది కూడా చదవండి : నాగబాబుకు మంత్రి పదవి.. కేటాయించే శాఖ ఇదే, మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్! ఇది కూడా చూడండి: కర్ణాటక మాజీ సీఎం కన్నుమూత అలాంటి ఫేక్ నోటీసులు చాలావరకు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయని కమిషన్ గమనించిన తర్వాత ఈ అలర్ట్ జారీ చేసింది. ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ (ODL), ఆన్‌లైన్ (OL) ఫార్మాట్‌లలో ప్రొగ్రామ్స్ సంబంధించి అప్డేట్లు కేవలం అధికారిక వెబ్‌సైట్ల నుంచి వచ్చినవి మాత్రమే నమ్మాలని సూచించింది. ఇది కూడా చదవండి : వేములవాడలో రాజన్న కోడెల కుంభకోణం.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు! ఇది కూడా చూడండి: బట్టలు ఆరేస్తుండగా.. విద్యుత్ షాక్‌తో ముగ్గురు మృతి UGC Warns Students యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వెబ్‌సైట్ ugc.gov.in లో మాత్రమే నోటిఫికేషన్‌లను అధికారికంగా ప్రచురిస్తుందని స్పష్టం చేసింది. ODL, OL ప్రోగ్రామ్‌లకు సంబంధించిన కచ్చితమైన ఇన్ఫర్మేషన్ UGC DEB పోర్టల్, deb.ugc.in ద్వారా ప్రచురించబడతాయని తెలియజేసింది. ఈ వెబ్‌సైట్‌లు UGCకి సంబంధించిన పబ్లిక్ నోటీసులు, సమాచారం ఇస్తామని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చెప్పుకొచ్చింది. ఫేక్ ఇన్ఫర్మేషన్, నోటీసులు గమనిస్తే కమిషన్ దృష్టికి తీసుకురావాలని కోరింది.